చిన్న వయసులోనే  మిలియనర్ అయిన ఓ బాలిక తాజాగా తన 12 వ పుట్టిన రోజు వేడుకల్లోనే తన వ్యాపారాల నుంచి రిటర్‌మెంట్‌ తీసుకోవాలనుకుంటుంది. అందుకే పెద్ద పార్టీని కూడ ఏర్పాటు చేసింది. ఆస్ట్రేలియాకి చెందిన యువ పారిశ్రామికవేత్త పిక్సీ కర్టిస్ తన బొమ్మల కంపెనీకి సీఈవో. ఆమెకు 10 సంవత్సరాల వయసు అంటే 2021 సంవత్సరంలో ఆమె తన తల్లితో కలిసి ఓ బొమ్మల కంపెనీ స్థాపించింది. 


కంపెనీ ఏర్పాఉట చేసిన కొద్దిరోజుల్లోనే ఆమె ఊహించని రీతిలో లాభాలను పొందింది. తన తండ్రి సంపాదన కంటే పిక్సీ నెల సంపాదన అధికం. ఆమె నెలనెలా 133,000 ల డాలర్లు ను ఆర్జిస్తుంది. ఈ క్రమంలో పిక్సీ తన 12 వ పుట్టిన రోజు నాడు వ్యాపారాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాలని ఆమె తండ్రి జాసెంకో నిర్ణయించుకున్నాడు. 


ఎందుకంటే పిక్సీ అతి త్వరలో ఉన్నత చదువులు చదవబోతుంది. అందుకే ఆమె బర్త్ డే వేడుకతో పాటు రిటైర్‌మెంట్‌ ఫంక్షన్‌ కూడా రెండింటిని ఒకేసారి చేయాలని వారు నిర్నయించారు. అందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అనేక మంది అతిథులు విచ్చేశారు. దానికి సంబంధించిన వీడియోను ఒకదానిని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ లో పంచుకుంది. 


కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ కూడా గూడీ బ్యాగ్ లను స్కిన్‌ కేర్ ఎసెన్షియల్స్ ను బహుమతులుగా ఇచ్చింది. ఈ బ్యాగ్‌లను లగ్జరీ ఆస్ట్రేలియన్ బ్యూటీ బ్రాండ్ MCoBeauty స్పాన్సర్ చేసింది. సోషల్ మీడియాలో ఆ వీడియోను చూసిన వారందరూ కూడా కొన్ని కామెంట్లు పెడుతున్నారు.


'' ఆహా ఈ పార్టీ ఎంత అద్భుతంగా ఉంది. నేను నా 12వ పుట్టిన రోజుకి మెక్‌ డోనాల్డ్స్ పార్టీని ఇచ్చాను. పరిస్థితులు ఎలా మారాయి. అని ఒక నెటిజన్‌ తెలిపాడు.  పిక్సీ తన ప్రతి సందర్భాన్ని కూడా ఇన్ స్టా గ్రామ్‌ లో పంచుకుంటుంది. ఆమెకు సుమారు 130,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. 


ఇవన్నీ ఇలా మరి కొంత మంది ఆమె బాల్యం గురించి ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా నువ్వు చిన్నపిల్లలా తయారవుతున్నందుకు చాలా సంతోషం. ఎందుకంటే ఆమె సీఈవో అయ్యిన తరువాత ఆమె చాలా పెద్దదానిలాగా కనిపించడానికి, సీఈవో లా ఉండటానికి ఆమె తన ఉద్యోగుల నుంచి నమస్కారాలు అందుకోవడానికి పెద్ద వ్యక్తిలా ప్రవర్తిస్తుందని, అది చాలా బాధకరమంటూ రాసుకొచ్చారు. 


పిక్సీకి ఇప్పటికే ఒక బెంజ్ కార్‌ కూడా ఉంది. కానీ ఆమె దానిని నడపడానికి మాత్రం అర్హురాలు కాదు. పిక్సీ 10 వ పుట్టిన రోజుకి ఆమె తల్లి ఆ ఖరీదైన కారును బహుమతిగా అందజేసింది.