3rd World War: మూడో ప్రపంచ యుద్ధం వస్తే యుగాంతం తప్పదా? దీనికి AI సమాధానం ఏంటీ?

Artificial Intelligence: మధ్యాప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితులతో మూడో ప్రపంచ యుద్ధం తప్పదనే మాట వినిపిస్తోంది. దీనిపై ఏఐ చాలా ఆసక్తికరమైన సమాధానాలు చెప్పుకొచ్చింది.

Continues below advertisement

AI Reacts On Third World War: హిజ్బుల్లా, ఇరాన్‌తో ఇజ్రాయెల్‌తో చేస్తున్న పోరు కారణంగా మధ్యప్రాశ్చం అగ్నిగుండంలా మారిపోయింది. పరిస్థితిని మూడో ప్రపంచ యుద్ధం దిశగా తీసుకెళ్తోంది. వచ్చేది థర్డ్ వరల్డ్ వార్ అనే భయం అందరిలో కనిపిస్తోంది. గల్లీ నుంచి వైట్ హౌస్ వరకు ప్రతి చోటా ఇదే డిస్కషన్ నడుస్తోంది. సోషల్ మిడియాలో కూడా థర్డ్ వరల్డ్ వార్ అనే హ్యాస్‌ ట్యాగ్ బాగా ట్రెండ్ అవుతోంది. దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలా అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు. 

Continues below advertisement

ప్రపంచంలో ఏం జరిగిన ఇప్పుడు ఠక్కున గుర్తుకు వచ్చేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI). అందుకే ఏబీపీ కూడా ఏఐను థర్డ్ వరల్డ్ వారు గురించి కొన్ని ప్రశ్నలు అడిగితే చాలా ఆసక్తికరమైన సమాధానాలు చెప్పింది. అసలు యుద్ధం వస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి. ఏ దేశం ఎవరికి మద్దతు ఇస్తుంది. దాని పరిణామాలు ఎలా ఉంటాయి అనే ప్రశ్నలు అడిగితే ఆశ్చర్యకరమైన ఆన్సర్స్ వచ్చాయి. Meta AI (Llama 3) ప్రకారం  ప్రపంచ యుద్ధం III అనేది చాలా వినాశకరమై పరిణామాలకు దారి తీస్తుంది. అనేక దేశాలు ఈ యుద్ధ రంగంలోకి దూకేందుకు ఒక ఊహాత్మక ఎత్తుగడతో ఉన్నాయి. 

3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రధాన కారణాలు ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలు, పోటీ తత్వం, అణు విస్తరణ, సైబర్ వార్, సాంకేతిక పురోగతి, ఆర్థిక అస్థిరత, వాతావరణ మార్పు, పర్యావరణ సమతౌల్యత దెబ్బతినడం,  వనరుల కోసం పోటీ. వీటి కారణంగానే యుద్ధం రావచ్చని చెప్పుకొచ్చింది. 

  • మధ్యప్రాచ్యంలో సంఘర్షణ (ఉదా: ఇరాన్-ఇజ్రాయెల్)
  • ఉత్తర కొరియా అణు ఆశయాలు
  • చైనా-యుఎస్ వాణిజ్యం, జియోగ్రాఫికల్ వివాదాలు
  • రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలు
  • తీవ్రవాద దాడులు లేదా సైబర్ ఘటనలు

ప్రపంచ యుద్ధం-3 ప్రారంభమైతే ఫలితం ఎలా ఉంటుంది?
ఇప్పుడు యుద్ధంలో ప్రపంచ దేశాలు కాలుపెడితే దాని ప్రభావం ప్రజలపై ఎలా ఉంటుంది అనే అతిపెద్ద ప్రశ్న. ఇది భారీ ప్రాణనష్టానికి దారితీస్తుందని, ప్రపంచం ఆర్థిక పతనం ప్రారంభమవుతుంది. మాంద్యంంలోకి జారిపోతుంది. పర్యావరణం కూడా తీవ్రంగా దెబ్బతింటుంది. అంతర్జాతీయ సంబంధాలు పూర్తిగా దెబ్బతింటాయి. వివిధ దేశాల్లో పాలన విచ్ఛిన్నమవుతుంది. మానవత్వం లేకుండా పోతుందని AI చెప్పింది. శరణార్థులు పెరిగిపోతారు. 

కొంతమంది నిపుణులు మూడో ప్రపంచ యుద్ధం ముందుగా రీజనల్ వార్‌గా ప్రారంభమవుతుందని విశ్వసిస్తారు. మరికొందరు సైబర్ వార్ లేదా ఆర్థిక క్రైసిస్‌ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ యుద్ధం ప్రధానంగా ప్రాక్సీ వార్‌ఫేర్ లేదా టెర్రరిజం ద్వారా జరగవచ్చని కొన్ని సిద్ధాంతాలు అభిప్రాయపడుతున్నాయి. అమెరికా, చైనా, రష్యా, యూరోపియన్ యూనియన్, ఇండియా, పాకిస్తాన్, ఉత్తర కొరియా, ఇరాన్, ఇజ్రాయెల్, నాటోతో పాటు ఇతర సంస్థలు ఈ ప్రపంచ యుద్ధంలో ప్రధాన పాత్ర పోషించవచ్చు. 

ప్రపంచం నిజంగా అంతం అవుతుందా?

3వ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరుగుతుంది? ఈ విషయం ఇప్పుడే చెప్పలేం, కానీ ప్రస్తుత పరిస్థితిని బట్టి, నిపుణుల అంచనాను బట్టి, పెరుగుతున్న ఉద్రిక్తతలు కారణంగా కొన్ని రోజుల్లో యుద్ధ జ్వాలలు రాజుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇప్పటికిప్పుడు మూడో ప్రపంచ యుద్ధాన్ని అంచనా వేయడం సాధ్యంకాదు. 'Meta AI' ప్రకారం,"3వ ప్రపంచ యుద్ధం పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. దౌత్యం, అంతర్జాతీయ సహకారం, గ్లోబల్ గవర్నెన్స్ ద్వారా యుద్ధాన్ని నిరోధించడంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. కలిసి పని చేయడం ద్వారా, శాంతియుతమైన స్థిరమైన వృద్ధిని సాధించగలం. కొత్త ప్రపంచాన్ని నిర్మించగలం."

Also Read: ఇజ్రాయెల్ ఇరాన్‌ను ఓడిస్తుందా? - ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోన్న వార్

Continues below advertisement