World second largest diamond : మనం ఏదైనా గోల్డ్ షాప్‌కు వెళ్లి చిన్న ఉంగరంలో కనిపించీ కనిపించనంత డైమండ్‌ను పెట్టింటుకుంటే.. మినిమం లక్ష రూపాయలు అవుతుంది. అలాంటిది 2,492 క్యారెట్ల వజ్రం అంటే ఎంత విలువ ఉంటుందో అంచనా వేయడం కష్టం. అంత క్యారెట్ విలువ గల వజ్రం ఇప్పటి ఒక్కటే.. అదీ కూడా వందేళ్ల కిందట బయటపడింది. ఆ తర్వాత ఇప్పుడు 2,492 క్యారెట్ల వజ్రం బోట్సువానాలో బయటపడింది.
బోట్సువానా ఆఫ్రికా దేశం. ఆ దేశంలో వజ్రాల గనులు ఉంటాయి. ఇష్టం వచ్చినట్లుగా తవ్వుకుని వజ్రాలు వెలికి తీస్తూ ఉంటారు అక్కడి మైనింగ్ వ్యాపారాలు. ఈ వజ్రాల గనుల కోసం గ్యాంగ్ వార్‌లు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఓ గనిలో వజ్రం బయటపడింది. అక్కడ వజ్రాల వ్యాపారాలకు ఏది రాయో.. ఏది ఖరీదైన వజ్రమో ఇట్టే తెలిసిపోతుంది. తమ గనిలో బయటపడిన ఆ వజ్రాన్ని చూసి.. వ్యాపారులు ఆనందంతో గంతులేశారు.
వందేళ్ల కింట దక్షిణాప్రికాలో 3106 క్యారెట్ల వజ్రం బయటపడింది. దాన్ని తొమ్మిది భాగాలుగా చేశారు. బ్రిటన్ రాజ కుటుంబాల ఆభరణాల్లో ఈ వజ్రాలే ఉంటాయి. బోట్సువానా ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రాలను ఉత్పత్తి చేసే దేశం. ఈ దేశ జీడీపీలో అత్యధిక శాతం వజ్రాల ఎగుమతుల ద్వారానే వస్తూంటాయి. ఇక్కడ అత్యధిక క్యారెట్స్ ఉన్న వజ్రాలు తరచూ జరుగుతూ ఉంటాయి. 2019లో 1758 క్యారెట్స్ డైమండ్ దొరికడం కూడా సంచలం సృష్టించింది. ఈ వజ్రాన్ని ఫ్రాన్స్ కంపెనీ లూయిస్ విట్టన్ కొనుగోలు చేసింది. ఎంత రేటుకు కొనుగోలు చేసిందో ప్రకటించలేదు.
ప్రస్తుతం లభించిన 2,492 క్యారెట్ల వజ్రం విలువను ఇంకా మదింపు చేస్తున్నారు. 40 మిలియన్ డాలర్ల వరకూ ఉండవచ్చని యూకే నిపుణులు అంచనా వేస్తున్నారు. 2016లో 1109 క్యారెట్స్ వజ్రాన్ని లండన్‌కు చెందిన గ్రాఫ్ డైమండ్స్ కంపెనీ యజమాని లారెన్స్ గ్రాఫ్ 53 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు.
బోట్సువానాలో అత్యధికంగా మైనింగ్ చేసేది ప్రైవేటు కంపెనీలే. యూరప్ కు చెందిన ప్రైవేటు కంపెనీలో వజ్రాల మైనింగ్ చేస్తాయి. అయితే ప్రతి కంపెనీలోనూ బోట్సువానా ప్రభుత్వానికి వాటా ఉంటుంది. ఇలా బయటపడిన వజ్రాల విలువలో ఇరవై నాలుగు శాతం.. బోట్సువానా ప్రభుత్వానికి కట్టాల్సిందే. అందుకే.. ఆ దేశానికి ఈ ఒక్క వజ్రంతో భారీ మొత్తం లభించనుందని అంచనా వేస్తున్నారు.