తంతే బూరెల బుట్టలో పడ్డారనే సామెత మనకు బాగా తెలుసు. కానీ ఆ అమెరికన్ మహిళకు తెలుసో లేదో కానీ.. అచ్చంగా ఈ సామెత ఆమె జీవితంలో నిజమయింది. ఆమె ఓ వ్యక్తి గట్టిగా నెట్టేయడంతో పోయి లాటరీ మిషన్ మీద పడింది. అలా పడటం వల్ల ఆమెకు ఏకంగా పది మిలియన్ డాలర్ల ప్రైజ్ వచ్చేసింది. జీవితంలో అద్భుతాలు జరుగుతాయంటే నమ్మాల్సిందేనని ఆమె అప్పుడు డిసైడయ్యారు. 


పాకిస్థాన్ భారీ కుట్రను ఛేదించిన అమెరికా- అధ్యక్షుడి భార్యనే టార్గెట్ చేసిన ఇద్దరి నిందితుల అరెస్టు


అమెరికాకు చెందిన ఎడ్వర్డ్స్ అనే మహిళ లాస్ ఎంజెల్స్‌లో  నివాసం ఉంటున్నారు. ఆమె ఇంటికి కావాల్సిన సరుకులు కొనుక్కోవడానికి ఇంటికి సమీపంలో ఉన్న సూపర్ మార్కెట్‌కు వెళ్లారు. షాపింగ్ చేశారు. అయితే అక్కడ ఉన్న లాటరీ మిషన్‌ను చూసి తాను కూడా  ఓ సారి ఆడాలనుకుంది.  నలభై డాలర్లు పెట్టి టోకేన్ తీసుకుంది. ఆ లాటరీ మిషన్ స్టైల్ ఏమిటంటే..ఓ నెంబర్ నొక్కాలి. ఆ నెంబర్ తిరిగి తిరిగి ఎంత ప్రైజ్ వస్తుందో చూపిపిస్తుంది. అంటే స్పిన్ వీల్ టైప్ అన్నమాట. ఆమె టోకెన్ తీసుకుని లాటరీ మిషన్ దగ్గరకు వెళ్లి..  ఏ నెంబర్ నొక్కాలా అని ఆలోచిస్తూ ఉంది. 


26/11 సూత్రధారి హఫీజ్ సయీద్‌కు 31 ఏళ్ల జైలు శిక్ష విధించిన పాకిస్థాన్ కోర్టు


ఇలా ఆలోచిస్తున్నంతలోనే ఓ వ్యక్తి దురుసుగా ఆమె పక్క నుంచి వెళ్లాడు. వెళ్లాడు అనడం కంటే తోసుకుంటూ వెళ్లాడు అనుకోవడం కరెక్ట్ . అలా తోసేయడంతో ఎడ్వర్డ్స్ చేయి లాటరీ మిషన్‌పై పడింది. దాంతో ఆమెకు తెలియకుండానే ఓ నెంబర్‌ను ప్రెస్ చేసినట్లయింది. దీంతో ఆమెకు మండిపోయింది. వెనక్కి తిరిగి తోసేసిన వ్యక్తిని పిలిచి చెడామడా తిట్టింది. కానీ అతను పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. కోపంగా అలా తిట్టినంత సేపు తిట్టి తిరిగి చూస్తే... ఎడ్వర్డ్స్‌కు షాక్ తగిలినంత పనైంది. ఎందుకంటే అక్కడ లాటరీ దగ్గర ఉన్న వారంతా ఆమెనే చూస్తున్నారు. ఎందుకలా చూస్తున్నారా అని.. లాటరీ మిషన్ వైపు చూసిన ఎడ్వర్డ్స్‌కి మైండ్ బ్లాంక్ అయిపోయింది. అందులో తనకు పది మిలియన్ డాలర్లు వచ్చినట్లుగా ఉంది. 


ఉక్రేనియన్ రైల్వే స్టేషన్‌పై రష్యా రాకెట్ అటాక్‌- 30 మందికిపైగా మృతి, 100 మందికి గాయాలు


అంతే ఎడ్వర్డ్స్ ఎగిరి గంతేసింది. అది తన ప్రైజ్ కాదని.. తోసేసిన వ్యక్తిదని అనుకుంది.  అనవసరంగా తిట్టానని ఫీలయింది. ఏదైనా కానీ ఎడ్వర్డ్స్‌కు అదృష్టం దరిద్రం పట్టుకున్నట్లుగా పట్టుకుందని.. అక్కడున్నవాళ్లంతా కంగ్రాట్స్ చెప్పారు. నిజమే మరి తంతే పది మిలియన్ డాలర్లు వచ్చేశాయి మరి !