తూర్పు ఉక్రేనియన్ నగరం క్రామాటోర్స్క్‌లోని ప్యాక్డ్ రైలు స్టేషన్‌పై రష్యా దాడి చేసింది. రాకెట్‌తో చేసిన ఈ దాడిలో 35 మంది వరకు రాకెట్ దాడిలో కనీసం 35 మంది మరణించారు. 100 మందికిపైగా గాయపడ్డారు. పౌరులను ఖాళీ చేయించి వేరే ప్రాంతానికి తరలిస్తున్నప్పు ఈ దాడి జరిగిందని రాయటర్స్ సంస్థ పేర్కొంది. 






వేరే ప్రాంతాలకు వెళ్లేందుకు మహిళలు, పిల్లలు, వృద్ధులు సిద్ధంగా ఉన్న టైంలో దాడి జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రెండు రాకెట్లను వెంటవెంటనే రష్యా ప్రయోగించిందని ఉక్రెయిన్ చెబుతోంది. 


"రెండు రాకెట్లు క్రమాటోర్స్క్ రైల్వే స్టేషన్‌ను తాకాయి. క్రామాటోర్స్క్ రైల్వే స్టేషన్‌పై రాకెట్ దాడిలో 30 మందికిపైగా మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు"అని ఉక్రేనియన్ రైల్వేస్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారని ఉక్రెయిన్ రైల్వే హెడ్ తెలిపారు.


రైల్వే స్టేషన్‌ను ఢీకొట్టినట్లు చెబుతున్న క్షిపణులను ఉక్రెయిన్ సైన్యం మాత్రమే ఉపయోగించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ సంస్థ పేర్కొంది.


క్షిపణులు తాకినప్పుడు వేల మంది ప్రజలు స్టేషన్‌లో ఉన్నారని డొనెట్స్క్ ప్రాంత గవర్నర్ పావ్లో కైరిలెంకో పేర్కొన్నారు. దాడి జరిగిన సమయంలో దాదాపు 4,000 మంది స్టేషన్‌లో ఉన్నారని క్రమాటోర్స్క్ మేయర్ ఒలెక్సాండర్ హోంచారెంకో తెలిపారు.






"రష్యన్ ఫాసిస్టులు వారు ఎక్కడ లక్ష్యంగా పెట్టుకున్నారో, వారికి ఏమి కావాలో బాగా తెలుసు: ప్రజల్లో భయాందోళనలు కలిగించాలని కోరుకున్నారు, వారు వీలైనంత ఎక్కువ మంది పౌరుల ప్రాణాలు తీయాలని చూస్తున్నారు."  మేయర్‌ ఒలెక్సాండర్‌ పేర్కొన్నారు. 


కైరిలెంకో తన సోషల్ మీడియాలో కుప్పల తెప్పలుగా పడి ఉన్న బ్యాగులు, ఇతర వస్తువులు.. పక్కనే పడి ఉన్న మృతదేహాలను చూపించే ఫోటోను షేర్ చేశారు. ఫ్లాక్ జాకెట్లు ధరించిన సాయుధ పోలీసులు వారి పక్కన నిలబడ్డారు.


"అమానవీయమైన రష్యన్లు తమ పద్ధతులను మార్చుకోవడం లేదు. యుద్దభూమిలో ఎదురొడ్డి నిలబడే శక్తి లేకుండా, పౌర జనాభాను నాశనం చేస్తున్నారు" అని ఉక్రియాన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కామెంట్ చేశారు.