US Viral News: నేను తప్పు చేయలేదు అంటే తప్పు చేయలేదని బిగ్గరగా అరుస్తూ.. కోర్టు హాల్లో లాయర్ వైపు పరుగెత్తి ఆ నిందితురాలు లాయర్ ను చితక్కొట్టేసింది. అతి కష్టం మీద పోలీసులు ఆమెను బంధించగలిగారు. పాత తెలుగు సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు కనిపిస్తూ ఉంటాయి కానీ.. అమెరికాలో మాత్రం నిజంగానే జరిగింది. టేలర్ షాబిజినెస్ అనే మహిళ కోర్టు హాల్లో లాయర్ పై విరుచుకుపడింది. తాను తప్పు చేయలేదని వాదించింది.
టేలర్ షాబిజినెస్ చేసిన నేరం ఏమిటో తెలిస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. టేలర్ షాబిజినెస్ 27 ఏళ్ల వయస్సులో మెథాంఫెటమైన్ అనే డ్ర్స్ తీాసుకుని తన ప్రియుడితో కలిసి శృంగారంలో పాల్గొన్నది. డ్రగ్స్ మోతాదు ఎక్కువ అయిందో నిజంగానే చంపాలనుకుందో కానీ..త శృంగారం చేస్తున్న సమయంలో తన ప్రియుడిని గొంతు పిసికి చంపేసింది. అతని శరీరాన్ని ముక్కలు చేసిది. అతని తలను ఒక బకెట్‌లో ఉంచి, శరీర భాగాలను ఇంట్లోనూ, కారులోనూ చెల్లాచెదురుగా పడేసింది. ఈ దారుణ హత్య తర్వాత ఆమె పోలీసులతో చెప్పిన విషయాలు భయంకరంగా ఉన్నాయి. తన బాయ్ ఫ్రెండ్ ను చంపడాన్ని తాను ఆనందించానని.. అతని తల నరకడం ఎక్సైటింగ్ గా ఉందని చెప్పిది. 2022లో ఈ హత్య ఘటన జరిగింది. అప్పట్లోనే టేలర్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. 2023లో పెరోల్ అవకాశం లేకుండా జీవిత ఖైదు శిక్షను విధించారు.
అయితే తాను ఏ తప్పూ చేయలేదని ఆమె వాదిస్తూ న్యాయపోరాటం చేస్తున్నారు. ఏప్రిల్ 4, 2025న విస్కాన్సిన్ కోర్టులో ఆమె పిటిషన్ పై విచారణ జరిగింది. విచారణ సందర్భంగా తన డిఫెన్స్ అటార్నీ కర్టిస్ జుల్కా పై కోర్టు గదిలో దాడి చేయడానికి టేలర్ ప్రయత్నించింది. దాడి చేయడానికి ప్రయత్నించిన వెంటనే కోర్టు గార్డులు ఆమెను అడ్డుకుని నియంత్రించారు. ఇది మొదటి సారి కాదు. రెండో సారి న్యాయవాదిపై దాడి చేయడానికి ప్రయత్నించాు. దటిసారి 2023లో ఆమె అప్పటి న్యాయవాది క్విన్ జోలీ పై దాడి చేసింది.
ఏప్రిల్ 4, 2025న జరిగిన కోర్టు ఘటన తర్వాత ఆమె న్యాయవాది కేసు నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. కోర్టు టేలర్ కు కొత్త లాయర్ ను నియమించింది. తనకోసం వాదిస్తున్న లాయర్లపైనే టేలర్ దాడి చేస్తూండటంతో ఆమె కోసం వాదించేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.