అమెరికా, బ్రిటన్, కెనడా అగ్ర రాజ్యాల్లో భారతీయులపై దాడులు కొనసాగుతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట విదేశాలలో భారతీయులు దాడులకు రావడం, అగంతకుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కెనడాలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది.
ఓ దుండగుడు కత్తితో చేసిన దాడిలో భారతీయుడు కెనడాలో ప్రాణాలు కోల్పోయాడు. కెనడాలోని అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. అతడి మృతి పై సంతాపం ప్రకటించారు. కెనడా రాజధాని ఒట్టావా సమీపంలోని రాక్ ల్యాండ్ ఏరియాలో ఓ భారతీయుడు హత్యకు గురయ్యాడు. ఓ దుండగుడు కత్తితో దాడి చేసి భారత యువకుడ్ని దారుణంగా హత్య చేశాడు. కత్తిపోట్లకు గురై తీవ్ర రక్తం స్రావంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు అని ఎంబసీ అధికారులు పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి కావాల్సిన సాయం చేస్తామన్నారు. ఈ సమయంలో వారు మనో ధైర్యంతో ఉండాలని సూచించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు. హత్యకు గల కారణాలపై నిందితుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ కష్ట సమయంలో మృతుడి కుటుంబ సభ్యులకు రామ అండగా ఉంటామన్నారు. కెనడాలో భారతీయులపై జరుగుతున్న దాడులు, హత్యాకాండపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఓవైపు కలిస్తాన్ ఉద్యమం కొనసాగుతుంటే, మరోవైపు భారతీయుల పై దాడులు హత్యలు కెనడా ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
కత్తిపోట్లతో ఒకరు మృతికెనడా న్యూస్ బ్రాడ్‌కాస్టర్ CBC ప్రకారం, క్లారెన్స్- రాక్‌ల్యాండ్‌లో కత్తితో జరిగిన దాడిలో ఒకరు మృతిచెందారు. ఈ కేసులో మరొక వ్యక్తిని అరెస్టు చేసినట్లు ప్రావిన్షియల్ పోలీసులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు లాలోండే స్ట్రీట్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఒట్టావా డౌన్‌టౌన్‌కు తూర్పున దాదాపు 40 కిలోమీటర్ల దూరంలోని ఒంటారియో ప్రావిన్షియల్ పోలీసులు వ్యక్తి హత్య గురించి వెల్లడించారు. కానీ అటు మృతుడి వివరాలు గానీ, ఇటు నిందితుడి వివరాలు కానీ తెలపలేదు.
రాక్‌ల్యాండ్‌లోని స్థానికులు తమకు సెక్యూరిటీ పెంచాలని, ఈ ప్రాంతంలో నేరస్తులపై, నిందితులపై పెంచాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. అమాయకులను హత్య చేసి వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్న ఘటనలతో విదేశాలలో చదువుకుంటున్న తమ పిల్లలకు ఏం జరుగుతుందోనని భారత్ లో ఉన్న వారి తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
