72nd Miss World Winner Opal Suchata Chuangsri : నెలరోజుల ఉత్కంఠ వీడింది. మిస్‌ వరల్డ్ పోటీ విజేతా ఓపల్ సుచాతా చువాంగ్‌శ్రీ నిలిచారు. 2025 మే 31న హైదరాబాద్‌లోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరిగిన 72వ మిస్‌ వరల్డ్‌ పోటీల్లో విజేతగా థాయ్‌లాండ్‌కు చెందిన ఓపల్ సుచాతా చువాంగ్ శ్రీ అనేక బహుమతులు అవకాశాలు దక్కించుకోనున్నారు. 

Continues below advertisement


ప్రైజ్‌ మనీ- ఓపల్‌కు సుమారు 8.5 కోట్ల రూపాయల నగదు బహుమతి లభించింది. ఈ మొత్తం మిస్‌ వరల్డ్ విజేతలకు ఇచ్చే ఆర్థిక ప్రోత్సాకంలో ఎక్కువ భాగం ఆమె తన వ్యక్తిగత లేదా వృత్తిపరమైన లక్ష్యాల కోసం ఉపయోగించుకోవచ్చు. 


మిస్‌ వరల్డ్‌ కిరీటం- ఓపల్‌కు మిస్ వరల్డ్ 2024 విజేత క్రిస్టీనా పిస్కోవా నుంచి ఐకానికి బ్లూ కిరీటాన్ని అందజేశారు. ఈ కిరీటం ఆమె విజయానికి బాధ్యతకు చిహ్నం 


అంతర్జాతీయ గుర్తింపు- మిస్ వరల్డ్ విజేతగా ఓపల్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చింది. ఆమె ఒక సంవత్సరంపాటు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్‌తో కలిసి పని చేస్తూ బ్యూటీ విత్ ఏ పర్పస్‌ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ఈ కార్యక్రమాలు సామాజిక సమస్యలపై అవగాహన పెంచడం, స్వచ్ఛంద కార్యకలాపాల్లో భాగం కావడం వంటివి కలిగి ఉంటాయి. 


ఓపల్ ఫక్‌ హర్‌ క్యాంపెయిన్‌కు మద్దతు- ఓపల్ రొమ్ము క్యాన్సర్ అవగాహన, ముందస్తు గుర్తింపుపై ఓపల్‌ ఫర్ హర్‌ అనే క్యాంపెయిన్‌ను నడుపుతోంది. మిస్‌ వరల్డ్‌ విజేతగా ఆ క్యాంపెయిన్‌కు ప్రపంచ వ్యాప్తంగా మద్దతు ఆర్థిక సాయం లభించే అవకాశం ఉంది. దీని వల్ల ఆమె ఈ సమాజిక కారణంపై మరింత ప్రభావంతంగా పని చేస్తారు. 


ప్రపంచ పర్యానలు, ఈవెంట్‌లు- మిస్ వరల్డ్‌గా ఓపల్ వివిధ దేశాల్లో పర్యటించవచ్చు. అంతర్జాతీయ ఈవెంట్‌లలో , సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది.  


వ్యక్తిగత బ్రాండ్ - ఈ విజయం ఓపల్‌కు మోడలింగ్, ఎండార్స్‌మెంట్స్, సామాజిక కార్యకర్తగా కొత్త అవకాశాలను కల్పిస్తుంది. ఆమెకు ఉన్న థాయ్‌, ఇంగ్లీష్, చైనీస్ భాషపై నైపుణ్యాలు మరింత దోహదపడతాయి. 


సాంస్కృతిక గౌరవం- థాయ్‌లాండ్‌కు మిస్ వరల్డ్‌ చరిత్రలో ఇదే మొదటి విజయం. ఓపల్ తన దేశానికి అపారమైన గౌరవాన్ని తీసుకొచ్చారు. ఆమె విజయం థాయ్‌లాండ్ సంస్కృతి, ఆందాన్ని ప్రపంచ వేదికపై చాటింది.