Virgin Atlantic Flight Fuel:
SAFతో గాల్లోకి తొలి విమానం..
ఏవియేషన్ హిస్టరీలోనే ఓ అరుదైన రికార్డు నమోదైంది. తొలిసారి ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్‌ని (ATF) కాకుండా 100% sustainable aviation fuel (SAF) తో ఓ విమానాన్ని నడిపారు. Virgin Atlantic కి చెందిన ఫ్లైట్ లండన్ నుంచి న్యూయార్క్ వరకూ ఇది ప్రయాణించింది. గతంలోనూ ఈ ఫ్యుయెల్‌తో ఓ కార్గోని నడిపారు. ఈ సారి ప్రయాణికులతో కూడిన విమానాన్ని ఇదే ఇంధనంతో నడిపారు. వర్జిన్ బోయింగ్ 787 (Virgin Boeing 787) లండన్ నుంచి బయల్దేరి న్యూయార్క్‌లోని జాన్.ఎఫ్.కెనడీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంది. ATF తో వాతావరణంలోకి కర్బన ఉద్గారాలు భారీ స్థాయిలో విడుదలవుతున్నాయి. ఈ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఇంధనం కోసం ఎన్నో రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం నుంచి సపోర్ట్ కూడా లభిస్తోంది. ఈ ఫ్లైట్‌లో వర్జిన్ అట్లాంటిక్ ఫౌండర్ రిచర్డ్ బ్రాన్సన్‌తో పాటు మరి కొందరు సిబ్బంది ప్రయాణించారు. సాధారణ ప్రయాణికులు మాత్రం ట్రావెల్ చేయలేదు. కన్వెన్షన్ జెట్ ఫ్యుయెల్‌తో నడిచిన తొలి ప్యాసింజర్ ఫ్లైట్‌గా రికార్డు సృష్టించింది. అంతర్జాతీయంగా పలు ఎయిర్‌లైన్స్ సంస్థలు దాదాపు 70% కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.
వాడకం తక్కువే..
అయితే...Sustainable Aviation Fuel ని ప్రొడ్యూస్ చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అంతే కాదు. భారీ మొత్తంలో ఈ ఫ్యుయెల్ దొరకడమూ కష్టమే. ప్రస్తుతానికి అంతర్జాతీయంగా చూస్తే...సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యుయెల్ వాడకం కేవలం 0.1% మాత్రమే ఉంది. రెగ్యులర్ జెట్ ఫ్యుయెల్ ధరతో పోల్చితే ఇది 3-5 రెట్లు ఎక్కువ. నిజానికి ఏవియేషన్ ఇండస్ట్రీలో కర్బన ఉద్గారాలు తగ్గించడం అనేది సవాలే అంటున్నారు నిపుణులు. ప్రస్తుతానికి విమానాల్లో వాడుతున్న ఇంజిన్‌లు 50% కన్నా ఎక్కువ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యుయెల్‌తో నడిచే విధంగా లేవు. జెట్ ఇంజిన్స్‌లో ఇప్పటికే ఈ ఫ్యుయెల్‌ని వినియోగిస్తున్నారు. వంటనూనెలు, జంతువుల కొవ్వు వ్యర్థాలను సింథటిక్ కిరోసిన్‌తో కలిపి ఈ ఇంధనం తయారు చేస్తారు.