America Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో చరిత్రలో తొలిసారిగా ఓ తెలుగు అమ్మాయికి వైట్ హౌస్ అఫీషియల్ ఎంట్రీ దొరికనట్లైంది. ట్రంప్ సునాయాస విజయంతో ఆయన ఉపాధ్యక్షుడిగా జేడీ వ్యాన్స్‌కి అవకాశం దక్కనుంది. జేడీ వ్యాన్స్ భార్య ఉషా చిలుకూరి తెలుగు మూలాలు ఉన్న అమ్మాయి. ప్రస్తుతం ఓహియో స్టేట్‌కు సెనేటర్‌గా ఉన్న జేడీ వాన్స్ శ్వేతజాతీయుడు. ఉషా చిలుకూరి తల్లిదండ్రులు దశాబ్దాల క్రితమే అమెరికా వెళ్లి సెటిల్ అయ్యారు. 


పేరుకే ఇది ట్రంప్ వర్సెస్ కమలాహారిస్ అయినా...ఈ యుద్ధంలో ట్రంప్‌కి తోడుగా నిలిచింది ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వ్యాన్స్ ఆయన భార్య ఉషా చిలుకూరి వ్యాన్స్. కమలాహారిస్ పూర్వీకులది తమిళనాడు అయితే ఉషా చిలుకూరి పూర్వీకూలు తెలుగు మూలాలు ఉన్నవారు. 


కమలాహారిస్ తల్లికి తండ్రి అంటే కమలా తాతగారైన పీవీ గోపాలన్ ఓ బ్యూరోక్రాట్. తమిళనాడులోని తులసేంథిరపురం నుంచి చెన్నైకి వచ్చి సెటిల్ అయ్యారు వాళ్లు. కమలాహారిస్ తల్లి అమెరికాకు వెళ్లటం అక్కడే పెళ్లి...కమలాహారిస్ ఆమె సోదరి జన్మించటం వాళ్లు పాలిటిక్స్‌లోకి రావటం ఇప్పుడు ఏకంగా అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడటం అన్నీ జరిగిపోయాయి. 


గత ఎన్నికల్లో ఉపాధ్యక్షురులిగా ఎన్నికై ఆ ఘనత సాధించిన తొలి భారతీయ మూలాలున్న మహిళగానూ కమలాహారిస్ చరిత్ర సృష్టించారు. ఇప్పుడు రిపబ్లికన్ సైడ్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వ్యాన్స్‌ను ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్. జేడీ వ్యాన్స్ భార్య ఉషా చిలుకూరి పూర్వీకులు గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి వచ్చిన వాళ్లు. వారి బంధువులు విశాఖపట్నంలో ఇప్పటికీ ఉన్నారు. ఆ తర్వాత ఉషా చిలుకూరి తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లి సెటిల్ అయ్యారు. 



Also Read: మిత్రమా! ప్రజల కోసం కలిసి పని చేద్దాం; ట్రంప్‌నకు మోదీ ట్వీట్, ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ


అమెరికాలోనే ఉషా జననం ఆ తర్వాత లా తర్వాత జేడీ వ్యాన్స్‌తో పెళ్లి జరిగాయి. సో అలా అనుకోకుండానే లేదా వ్యూహాత్మకంగానే డెమోక్రాట్, రిపబ్లికన్ పార్టీలు రెండూ కూడా భారతీయ మూలాలన్న వ్యక్తుల ప్రమేయం ఈసారి ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌లో ఉండేలా చేశాయి. ట్రంప్ గెలుపుతో  తమిళ సంతతి మహిళ అయిన కమలాహారిస్ బృందంపై తెలుగు సంతతి మహిళ అయిన ఉషా చిలుకూరి బృందంపై చేయి సాధించిందన్న మాట.


ఉషా న్యాయవిద్యను పూర్తి చేసి సుప్రీంకోర్టులో లా కర్క్‌గా పనిచేశారు. జేడీ వాన్స్ తన జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా ఓ పుస్తకాన్ని రాసుకున్నారు. ఆ పుస్తకం ఆధారంగా Hillbilly Elegy అనే సినిమాను 2020లో నెట్ ఫ్లిక్స్(Netflix) తీసింది. స్లమ్ డాగ్ మిలీనియర్ సినిమాలో హీరోయిన్‌గా నటించిన భారత సంతతి నటి ఫ్రీదా పింటో ఆ సినిమాలో ఉషా చిలుకూరి పాత్రను పోషించారు. ఇప్పుడు ట్రంప్ విజయంతో అమెరికా ఉపాధ్యక్షుడి భార్యగా ఉషా చిలుకూరి వైట్ హౌస్ కార్యక్రమాలకు రాయల్ ఎంట్రీ ఇవ్వనున్నారు.


Also Read: గెలిచింది ట్రంప్ - గెలిపించింది మస్క్ -అమెరికా రాజకీయాల్లో కొత్త సూపర్ స్టార్