PM Modi And Other Country Wishes To Trump: అమెరికా ఎన్నికల్లో భారీ విజం సాధించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. "మీ చారిత్రాత్మక విజయానికి నా స్నేహితుడు డొనాల్డ్ ట్రంప్‌నకు హృదయపూర్వక అభినందనలు" అని ప్రధాని మోదీ అన్నారు.
"మీ గత పని తీరు ఆధారంగా భారతదేశం-యుఎస్ మధ్య సమగ్ర గ్లోబల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, సహకారాన్ని పునరుద్ధరించడానికి ఎదురు చూస్తున్నాను. మన ప్రజల శ్రేయస్సు, అభివృద్ధికి, ప్రపంచ శాంతి, స్థిరత్వానికి కలిసి పని చేద్దాం." అని అతను X లో పోస్ట్‌లో పేర్కొన్నాడు. ట్రంప్‌తో ఉన్న ఫొటోలను మోడీ షేర్ చేశారు.
ట్రంప్‌ను అభినందించిన ఉక్రేనియన్ అధ్యక్షుడు జెలెన్స్కీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ కూడా డొనాల్డ్ ట్రంప్ అద్భుతమైన ఎన్నికల విజయంపై అభినందనలు తెలిపారు. "సెప్టెంబర్‌లో ప్రెసిడెంట్ ట్రంప్‌తో జరిగిన సమావేశం గుర్తుంది, మేము ఉక్రెయిన్-యుఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యం, విక్టరీ ప్లాన్, ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను ముగించే మార్గాల గురించి మాట్లాడాంం" అని Xలో పోస్టు చేశారు.
"గ్లోబల్ వ్యవహారాలకు బలమైన మరియు శాంతి ఆధారిత విధానానికి అధ్యక్షుడు ట్రంప్ నిబద్ధతను అభినందిస్తున్నాను" అని ఆయన అన్నారు. ఉక్రెయిన్‌లో శాంతిని ఆచరణాత్మకంగా దగ్గరగా తీసుకురాగల సూత్రం ఇదే. మేము కలిసి దానిని అమలు చేస్తామని ఆశిస్తున్నాను.
"ట్రంప్ నిర్ణయాత్మక నాయకత్వంలో బలమైన యునైటెడ్ స్టేట్స్ స్వర్ణ యుగం కోసం ఎదురుచూస్తున్నాము" అని చెప్పారు. యునైటెడ్ స్టేట్స్‌లో ఉక్రెయిన్‌కు ద్వైపాక్షిక మద్దతు కొనసాగుతుందని భావిస్తున్నాము. "రెండు దేశాలకు ప్రయోజనం చేకూర్చే పరస్పర ప్రయోజనకరమైన రాజకీయ ఆర్థిక సహకారాన్ని అభివృద్ధి చేయడానికి ఆసక్తి కలిగి ఉన్నాము" అని జెలెన్స్కీ తన పోస్ట్‌లో తెలిపారు.
కూటమిని 'బలంగా' ఉంచుతుంది: నాటో చీఫ్
NATO చీఫ్ మార్క్ రుట్టే మాట్లాడుతూ, "అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కు అభినందనలు తెలిపాను. మా కూటమిని పటిష్టంగా ఉంచడానికి అతని నాయకత్వం మళ్లీ కీలకం అవుతుంది. NATO ద్వారా ముందుకు సాగడానికి, కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నాను."
శాంతి కోసం ట్రంప్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధం: ఇమ్మాన్యుయేల్ మాక్రాన్
డొనాల్డ్ ట్రంప్‌కు అభినందనలు తెలుపుతూ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, "అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అభినందనలు. నాలుగేళ్లు కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గౌరవం, మంచి ఆశయంతో శాంతి, శ్రేయస్సు కోసం మీతో కలిసి పని చేయడనికి సిద్ధం. "
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ అభినందనలు
అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్‌నకు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ శుభాకాంక్షలు తెలిపారు. X లో పోస్ట్ చేస్తూ... డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల విజయంపై అభినందనలు తెలిపారు. ఆస్ట్రేలియన్లు, అమెరికన్లు గొప్ప నిజమైన మిత్రులు. కలిసి పని చేయడం ద్వారా దేశాలు, ప్రజల మధ్య భాగస్వామ్యం భవిష్యత్తులో బలంగా ఉండేలా చూసుకోవచ్చు. అని అన్నారు.
ట్రంప్‌ను అభినందించిన స్పానిష్ ప్రధాని
డోనాల్డ్ ట్రంప్‌కు స్పెయిన్ వామపక్ష ప్రధాన మంత్రి పెడ్రో శాంచెజ్ అభినందనలు తెలియజేశారు. "బలమైన అట్లాంటిక్ భాగస్వామ్యానికి" కృషి చేద్దామని పిలుపునిచ్చారు.