US Elections Results 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేసిన డొనాల్డ్ ట్రంప్‌ భారీ విజయం దిశగా సాగుతున్నారు. ఇప్పటికే ఆయన 300కుపైగా ఎలక్టోర్స్‌లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే ఫైనల్ రిజల్ట్స్ వస్తున్నాయి. ప్రస్తుతానికి ఉన్న ఆధిక్యం చూస్తే ట్రంప్‌ గట్టిగానే కొట్టినట్టు కనిపిస్తోంది. 


2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతానికి 277 ఎలక్టోర్స్‌లో విజయం సాధించారు. గట్టి పోటీ ఇస్తారు అనుకున్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి  కమలా హారిస్ కేవలం 226 ఎలక్టోర్స్ వద్ద ఉండిపోవాల్సి వచ్చింది. ఇంకా ఫలితం రావాల్సిన 35 ఎలక్టోర్స్‌లో కూడా ట్రంప్‌ హవా కొనసాగుతోంది. అక్కడ కూడా ఫైనల్ రిజల్ట్స్ వస్తే మాత్రం ట్రంప్‌ మెజార్టీ 312 గా ఉండబోతోంది. 
అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి పార్లమెంట్‌లో భారీ మెజారిటీ వచ్చింది. సెనేట్‌లో మెజార్టీ రిపబ్లికన్ అభ్యర్థులు విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన 51 మంది, డెమోక్రటిక్ పార్టీకి చెందిన 42 మంది అభ్యర్థులు విజయం సాధించారు.


ఫాక్స్ న్యూస్ నివేదిక ప్రకారం, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ 270 ఎలక్టోరల్ ఓట్ల మెజారిటీ మార్కును అధిగమించారు. యునైటెడ్ స్టేట్స్ తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతానికి ట్రంప్ 277 ఎలక్టోరల్ ఓట్లు సాధించి, 226 ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకున్న డెమొక్రాట్ కమలా హారిస్‌ను ఓడించారు.



7 స్వింగ్ రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్ ముందంజ
అమెరికాలోని ఏడు స్వింగ్ రాష్ట్రాల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యం చూపారు. ఏపీ ట్రెండ్స్ ప్రకారం పెన్సిల్వేనియా, మిచిగాన్, విస్కాన్సిన్, జార్జియా, నెవాడా, అరిజోనా, నార్త్ కరోలినాలలో ట్రంప్ పైచేయి సాధించారు. 


రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఇప్పటి వరకు 24 రాష్ట్రాల్లో విజయం సాధించారు. ఇంకా 5 రాష్ట్రాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఆయన ప్రత్యర్థి డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ 17 రాష్ట్రాల్లో విజయం సాధించారు. ఇంకా 3 కేవలం రాష్ట్రాల్లోనే ముందంజలో ఉన్నారు. 


ప్రపంచవ్యాప్తంగా అభినందనలు


డొనాల్డ్ ట్రంప్‌కు మెజారిటీ వచ్చిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా వివిద దేశాల అధినేతల శుభాకాంక్షలు చెబుతున్నారు. ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు నయీబ్ బుకెలే శుభాకాంక్షలు తెలిపారు. "అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కు అభినందనలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి, మార్గదర్శకత్వం చేస్తాడు’ అని అన్నారు.