అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇప్పటి వరకూ రాజ్యాంగ హక్కుగా ఉన్న అబార్షన్స్ చారిత్రక తీర్పు వెలువరించింది. చరిత్రాత్మక Roe Vs Wade Ruling ను అమెరికా సుప్రీంకోర్టు ఉపసంహరించుకుంది. దీని ఫలితంగా అమెరికాలో ఇప్పటివరకూ రాజ్యాంగ హక్కుగా ఉన్న అబార్షన్స్ ను సుప్రీంకోర్టు వెనక్కి తీసుకున్నట్లైంది. అమెరికాలో అబార్షన్స్ ను రాజ్యాంగ హక్కుగా తొలగించాలన్న తీర్పుకు అనుకూలంగా ఆరుగురు న్యాయమూర్తులు ఓటు వేశారు. ముగ్గురు వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. దీంతో అబార్షన్స్ పై అమెరికాలో నిషేధం పడనుంది. 






అతిపెద్ద వెనకడుగు 


అమెరికా మహిళలు ఇప్పటివరకూ రాజ్యాంగహక్కుగా ఉన్న అబార్షన్స్ ఇకపై చట్టవిరుద్ధం కానున్నాయి. ప్రత్యేకించి తెలుగు వాళ్లు ఎక్కువగా ఉండే టెక్సాస్ సహా పదమూడు  రాష్ట్రాల్లో తక్షణమే లేదా నెలరోజుల్లో ఈ నిషేధం అమలు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అమెరికన్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై మిశ్రమ స్పందన వినిపిస్తోంది. ప్రతీ ప్రాణానికి ఈ భూమిపై బతికే హక్కు ఉందని ఈ తీర్పు తమ విజయంగా రిపబ్లికన్లు ప్రకటించుకున్నారు. డెమొక్రాట్లు మాత్రం ఈ తీర్పుతో వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్లవుతుందని అభిప్రాయపడుతున్నారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఈ తీర్పును అతిపెద్ద వెనకడుగుగా అభివర్ణించారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సైతం ఈ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అబార్షన్ అనేది మానవహక్కుగానే ఉండాలని ట్వీట్ చేసిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ దీనిపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించింది. సంచలన తీర్పుతో సుప్రీంకోర్టు పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటుచేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.