US President Donald Trump: ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వం పని చేయలేదు. ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు మొదలయ్యాయి. దీనిపై అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు . ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు రెండు దేశాలపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒప్పందం తర్వాత ఇజ్రాయెల్ బాంబు దాడి దీనిపై ఇరాన్ రియాక్షన్‌ను ఆయన ప్రత్యేకంగా ఖండించారు.
నిన్న ప్రకటించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు ఇజ్రాయెల్, ఇరాన్ రెండింటినీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం తీవ్రంగా విమర్శించారు. హేగ్‌లో జరిగే నాటో శిఖరాగ్ర సమావేశానికి బయల్దేరడానికి సిద్ధమవుతున్న టైంలో మీడియాతో మాట్లాడారు. శత్రుత్వాన్ని కొనసాగడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కాల్పుల విరమణ ప్రకటన తర్వాత ఇజ్రాయెల్ ప్రతిస్పందన విమర్శించారు. ఇరాన్‌పై దాడి చేయవద్దని ఇజ్రాయెల్‌ను హెచ్చరించారు. ఆపై కాల్పుల విరమణ కొనసాగుతోందని పేర్కొన్నారు.
వైట్ హౌస్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ ఇలా వ్యాఖ్యానించారు, "వారు దానిని ఉల్లంఘించారు కానీ ఇజ్రాయెల్ కూడా దానిని ఉల్లంఘించింది. మేము ఒప్పందం కుదుర్చుకున్న వెంటనే, ఇజ్రాయెల్ బయటకు వచ్చి బాంబులు వేసింది. రెండు దేశాలు చాలా కాలంగా చాలా తీవ్రంగా పోరాడుతున్నాయి. అవి ఏమి చేస్తున్నాయో వారికి తెలియదు." అని బూతులతో రెచ్చిపోయారు.
"నేను ఇజ్రాయెల్ చర్యతో సంతోషంగా లేను" అని ఆయన అన్నారు. తీవ్రతరం అవుతున్న పరిస్థితిని ఆపడానికి జోక్యం చేసుకోగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. “బాంబులు వేయకండి”: ఇజ్రాయెల్‌కు ట్రంప్ సందేశం
ట్రంప్ ఇజ్రాయెల్ పాలకులకు ప్రత్యేక సందేశం ఇచ్చారు. “ఇజ్రాయెల్. ఆ బాంబులను వేయకండి. మీరు అలా చేస్తే, అది పెద్ద తప్పు అవుతుంది. మీ పైలట్లను ఇప్పుడే వెనక్కి వచ్చేయమని చెప్పండి! డొనాల్డ్ జె. ట్రంప్, యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు.” అని పంపించారు.
ఇరాన్ ప్రభుత్వం కాల్పుల విరమణ ఉల్లంఘించిందని పేర్కొని దానికి వ్యతిరేకంగా ప్రతీకారం తీర్చుకుంటున్నామని ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) ప్రకటించిన కొద్దిసేపటికే ట్రంప్ కీలక పోస్టు పెట్టారు. ఇజ్రాయెల్‌పై ఎటువంటి క్షిపణి ప్రయోగం చేయలేదని తెలిపింది. టెహ్రాన్ ఆరోపణలను తోసిపుచ్చింది.
రాయిటర్స్ ప్రకారం, ట్రంప్ ఇజ్రాయెల్ సైనిక చర్యలపై నిరాశ వ్యక్తం చేశాడు."ఇజ్రాయెల్ ఇప్పుడు చేస్తున్న పనితో సంతోషంగా లేను. ఒక మిసైల్ ప్రయోగించిందని తెలుస్తోంది. అది దాని లక్ష్యాన్ని చేరుకోలేదు. రెండు దేశాలు శాంతించాలి. ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఇజ్రాయెల్ ఇలా చేయడం నచ్చలేదు... అది మేము కోరుకునేది కాదు..."
ఇరాన్ కాల్పుల విరమణ చేస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇరాన్ దూకుడును ఖండించింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి టెహ్రాన్‌ను లక్ష్యంగా చేసుకుని కొత్త దాడులకు వ్యూహరచన చేస్తున్న వేళ పరిస్థితి వేగంగా దిగజారింది. దీనిని ఖండించిన ఇరాన్ కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత గంటన్నర పాటు ఇజ్రాయెల్ దాడులు కొనసాగాయని ఆరోపించింది.
అశాంతి ఉన్నప్పటికీ, మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రాంతాలలో పరిస్థితి నార్మలైజ్ అయినట్టు నివేదికలు వస్తున్నాయి. రాయిటర్స్ ప్రకారం, టెహ్రాన్‌కు తిరిగి వస్తున్న 38 ఏళ్ల ఇరానియన్ రెజా షరీఫీ, "మేము సంతోషంగా ఉన్నాము, చాలా సంతోషంగా ఉన్నాము. ఎవరు మధ్యవర్తిత్వం వహించారు లేదా అది ఎలా జరిగిందనేది పట్టింపు లేదు. యుద్ధం ముగిసింది. " అని అన్నారు.
ఇజ్రాయెల్‌లో, టెల్ అవీవ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరిక్ డైమంత్, గత ఆదివారం బాంబు దాడిలో తన ఇల్లు ధ్వంసం కావడం పట్ల బాధపడ్డాడు. " బాధగా ఉంది. కొంచెం ఆలస్యమైంది. ఈ కాల్పుల విరమణ కొత్త ప్రారంభం అని నేను ఆశిస్తున్నాను" అని ఆయన రాయిటర్స్‌తో అన్నారు.
ట్రంప్ ముందుగా ట్రూత్ సోషల్ పోస్ట్ ద్వారా కాల్పుల విరమణ ప్రకటించారు: “సీజ్‌ఫైర్ ఇప్పుడు అమలులో ఉంది. దయచేసి దానిని ఉల్లంఘించవద్దు!” కానీ రెండు వైపులా ఆరోపణలు, దాడులతో, కాల్పుల విరమణ ప్రమాదంలో పడుతుంది.