Pentagon releases video of US attack on Iran nuclear sites: ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్ పేరుతో అమెరికా సైన్యం ఇరాన్‌లోని మూడు కీలక న్యూక్లియర్ కేంద్రాలపై దాడి చేసింది. ఫోర్ , నటాంజ్ , ఇస్ఫహాన్ B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్‌లు బాంబుల వర్షం కురిపించాయి. పెంటగాన్ జూన్ 24, 2025న ఈ ఆపరేషన్‌కు సంబంధించిన అధికారిక వీడియో ఫుటేజ్‌ను విడుదల చేసింది, ఇందులో B-2 బాంబర్‌లు వైట్‌మన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుండి బయలుదేరడం, దాడి అనంతరం తిరిగి వచ్చే దృశ్యాలు ఉన్నాయి.
జూన్ 21, 2025 అర్ధరాత్రి దాటిన తర్వాత మిస్సోరీలోని వైట్‌మన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుండి B-2 బాంబర్‌లు బయలుదేరాయి. ఇది B-2 చరిత్రలో రెండవ అత్యంత దీర్ఘమైన మిషన్ అనుకోవచ్చు. మొదటి సారి 2001లో ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్ మొదటి స్థానంలో ఉంది. ఇరాన్ న్యూక్లియర్ సామర్థ్యాన్ని నాశనం చేయడానికి ఈ ఆపరేషన్ ను నిర్వహించారు. అమెరికా చరిత్రలో అతిపెద్ద B-2 దాడి గా చెప్పుకోవచ్చు.
ఇందులో 125కు పైగా అమెరికా యుద్ధ విమానాలు పాల్గొన్నాయి, ఇందులో ఏడు B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్‌లు, F-22 రాప్టర్‌లు, F-35 లైటనింగ్ IIలు ఉన్నాయి. ఎయిర్ రీఫ్యూయలింగ్ ట్యాంకర్‌లు, ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్, ISR విమానాలు, ఒక గైడెడ్ మిసైల్ సబ్‌మెరీన్ కూడా ఈ ఆపరేషన్ లో పాలు పంచుకున్నాయి. ఏడు B-2 బాంబర్‌లు ఇరాన్‌పై దాడి చేయడానికి ఎటువంటి సమాచారం లీక్ కాకుండా మినిమల్ కమ్యూనికేషన్ తో 18 గంటల పాటు ఎట్లాంటిక్ , మధ్యధరా సముద్రం గుండా ప్రయాణించాయి. అదే సమయంలో, మరో ఆరు B-2లు గ్వామ్‌లోని ఆండర్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్ కు పసిఫిక్ మీదుగా పశ్చిమ దిశగా ఎగిరాయి. ఇది ఇరాన్ , ఇతర ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ కు తప్పుదోవ పట్టించే వ్యూహంతో అమలు చేశారు.
ఏడు B-2 బాంబర్‌లు 14 GBU-57 MOPలను ఇరాన్ అణు కేంద్రాలపై జార విడిచాయి, ఇవి రాక్ లేదా కాంక్రీట్‌లో 200 అడుగుల లోతు వరకు చొచ్చుకుపోయే సామర్థ్యం కలిగిన బంకర్ బస్టర్ బాంబులు. తర్వాక, B-2లు వైట్‌మన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌కు తిరిగి చేరుకున్నాయి. 11,400 కిలోమీటర్లు ప్రయాణించాయి. అనేక సార్లు ఇన్-ఫ్లైట్ రీఫ్యూయలింగ్‌లతో 37 గంటల మిషన్‌ను పూర్తి చేశాయి. ఇజ్రాయెల్ గత 10 రోజులుగా ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లను గణనీయంగా ధ్వంసం చేసినందున గగన మిసైళ్లు అమెరికన్ విమానాలను గుర్తించలేదు. పెంటగాన్ విడుదల చేసిన వీడియోలో B-2 స్పిరిట్ బాంబర్‌లు వైట్‌మన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లోని హ్యాంగర్‌ల నుండి బయలుదేరడం, జూన్ 21 అర్ధరాత్రి 12:01కి టేకాఫ్ చేయడం, జూన్ 22 ఉదయం తిరిగి ల్యాండ్ అవడం ఉన్నాయి.