Iran Israel Ceasefire: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుగానే ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం క్రెడిట్ కొట్టేశారు. తాను చేసిన ప్రతిపాదనకు ఇరాన్, ఇజ్రయెల్  అంగీకరించినట్లు మంగళవారం వేకువజామున ట్రంప్ ప్రకటించారు. కొన్ని గంటల తరువాత మొదట ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించగా.. ఇజ్రాయెల్ ప్రభుత్వం సైతం సీజ్ ఫైర్‌కు సమ్మతం తెలిపింది. కాల్పుల విరమణపై నిర్ణయం వెల్లడించడానికి ముందు ఇజ్రాయెల్ పై మూడు మిస్సైల్స్ ఇరాన్ ప్రయోగించింది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో, ఇరాన్ కనుక ఈ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తే, తాము తీవ్రంగా స్పందిస్తామని పేర్కొన్నారు.

ఇరాన్ కు చెందిన అణు ఆయుధాలు, క్షిపణి ముప్పును అంతం చేయాలనే ఇజ్రాయెల్ భావించిన లక్ష్యాన్ని విజయవంతంగా సాధించామని ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆఫీసు ప్రకటనలో.. ఆపరేషన్ 'రైజింగ్ లయన్' అన్ని లక్ష్యాలను ఇజ్రాయెల్ సాధించిందని, ఇది ఇప్పుడు కాల్పుల విరమణకు అంగీకరించేలా చేసిందని ఇజ్రాయెల్ చెబుతోంది.

నెతన్యాహు టాప్ లెవల్ అధికారులతో సమావేశంప్రకటన ప్రకారం, సోమవారం రాత్రి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు రక్షణ మంత్రి, ఇజ్రాయెల్ సైన్యం (IDF) చీఫ్, మొసాద్ చీఫ్‌తో కలిసి మంత్రివర్గ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరాన్ చేపట్టిన అణ్వస్త్ర, క్షిపణి కార్యక్రమాల నిలిపివేతతో రెండు ముప్పులు తొలగాలని చర్చించారు.  నిర్ధారించారు.

టెహ్రాన్‌లో భారీ దాడులు, బసిజ్ యొక్క వందలాది మంది ఆపరేటర్లు హతంఇజ్రాయెల్ రక్షణ దళాలు టెహ్రాన్ గగనతలంపై పూర్తి నియంత్రణను ఏర్పాటు చేశాయి మరియు ఇరాన్ మిలిటరీ నాయకత్వం మరియు ప్రభుత్వం యొక్క డజన్ల కొద్దీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని వాటిని ధ్వంసం చేశాయి. గత 24 గంటల్లో టెహ్రాన్ నడిబొడ్డున అనేక ప్రభుత్వ స్థావరాలపై దాడులు జరిగాయని, ఇందులో ఇరాన్ అర్ధసైనిక సంస్థ 'బసిజ్'కు చెందిన వందలాది మంది సభ్యులు మరణించారని, ఒక సీనియర్ అణు శాస్త్రవేత్త కూడా హతమయ్యాడని ప్రకటనలో పేర్కొన్నారు.

ట్రంప్‌నకు ధన్యవాదాలు, అమెరికా భాగస్వామ్యంపై హర్షంఇరాన్ తో ఉద్రిక్తతల సమయంలో అమెరికా ప్రభుత్వం, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అందించిన సహకారానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కృతజ్ఞతలు తెలిపారు. ఇజ్రాయెల్, అమెరికా మధ్య పూర్తి సమన్వయం ఉండటంతో కాల్పుల విరమణకు ఇరాన్‌ మీద ట్రంప్ ఒత్తిడి పెంంచారు. ట్రంప్ సూచనతో కాల్పుల విరమణ ప్రతిపాదనను అంగీకరించామని ఓ ప్రకటనలో ఇజ్రాయెల్ అధినేత పేర్కొన్నారు.

ఉల్లంఘనపై తీవ్ర ప్రతిస్పందన హెచ్చరికకాల్పుల విరమణకు అంగీకారం తెలిపి, దీన్ని ఉల్లంఘిస్తే కనుక ఇజ్రాయెల్ దీటుగా స్పందిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. హోమ్ ఫ్రంట్ కమాండ్ జారీ చేసిన అన్ని భద్రతా సూచనలను పాటించాలని పౌరులకు నెతన్యాహు విజ్ఞప్తి చేశారు.

ఇజ్రాయెల్ బలగాలు, పౌరులకు అభినందనలుఇరాన్‌తో గత 12 రోజులుగా జరుగుతున్న పోరాటంలో తమ కుటుంబసభ్యులు, ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన సైనికులు, దాడుల్లో గాయపడిన పౌరులు త్వరగా కోలుకోవాలని నెతన్యాహు ఆకాంక్షించారు. ఆపరేషన్ 'రైజింగ్ లయన్'ను చారిత్రాత్మక సైనిక విజయంగా పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ దేశ భవిష్యత్తును సురక్షితం చేసిందని ప్రభుత్వం తెలిపింది. కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ విషయంపై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.