అమెరికా అధ్యక్షుడు జోయ్ బిడెన్ ఎవరూ లేకపోయినా షేక్ హ్యాండ్ ఇస్తున్న వీడియో వైరల్ అయింది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ముఖ్య అతిధిగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రసంగించారు. ప్రసంగం ముగిసింది. తర్వాత తన ఫైల్‌ను మూసేసుకున్నారు.  వెంటనే పక్కన ఎవరూ లేకపోయినా షేక్ హ్యాండ్స్ ఇస్తూ వెళ్లారు. ఇదివైరల్ అయింది. 



అయితే అమెరికా అధ్యక్షుడు ఇలా ఏ కార్యక్రమంలో అయినా పాల్గొన్నా.. చాలా మంది షేక్ హ్యాండ్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. ఆ మైండ్‌లో ఉన్న బిడెన్ అలా షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటూ వెళ్లారని భావిస్తున్నారు. 






అయితే జోయ్  బిడెన్ ఆరోగ్య పరిస్థితిపై తరచూ ఏదో వార్త బయటకు వస్తూనే ఉంటుంది. తాజాగా ఆయన వీడియో వైరల్ కావడంతో ఆయన డిమెన్షియా బాధితుడిలా ఉన్నారని అక్కడి రాజకీయ పార్టీలు విమర్శించడం ప్రారంభించాయి. 


 





ఈ  ఇన్సిడెంట్‌పై చాలా మంది సెటైర్లు వేస్తున్నారు. కొంత మంది ప్రత్యేకంగా వీడియోలు కూడా చేస్తున్నారు.