Imran Khan : ఇప్పుడు నేను చాలా డేంజర్ - పాక్ విపక్షాలకు ఇమ్రాన్ వార్నింగ్ !

ఇప్పుడు తాను చాలా ప్రమాదకారినని పాక్ విపక్షాలకు ఇమ్రాన్ ఖాన్ వార్నింగ్ ఇచ్చారు. తనను పదవి నుంచి దించేయడంతో ఆయన పాకిస్థాన్లో ర్యాలీలు ప్రారంభించారు.

Continues below advertisement


విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు నాతో పెట్టుకోవద్దు గ్యారంటీ ఉండదని బహిరంగ హెచ్చరికలు చేసిన ఇమ్రాన్ ఖాన్ పదవి పోయిన తర్వాత మాట మార్చారు.  పదవిలో ఉన్నప్పుడు అంత ప్రమాదకరంగా వ్యవహరించలేదని కానీ ఇప్పుడు మాత్రం తాను చాలా ప్రమాదకరమని అంటున్నారు. తనకు ఇప్పుడు పదవి లేదని, తాను మరింత ప్రమాదకరంగా మారుతానని హెచ్చరింస్తున్నారు. అధికారం కోల్పోయిన అనంతరం మొదటిసారిగా గురువారం పెషావర్‌లో బహిరంగ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేశారు .

Continues below advertisement

ఏలియన్స్‌ ఉన్నట్లుగా మరో సాక్ష్యం ? నాసా కొత్త ఫోటో చూస్తే అలాగే అనిపిస్తుంది మరి

దేశంలో తమ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రతిపక్ష పార్టీల సహాయంతో విదేశీ శక్తులు కుట్ర పన్నినట్లు ఇమ్రాన్‌ ఖాన్‌ స్పష్టం చేశారు.  తనను పదవి నుంచి దించేయడంతో ఆయన ర్యాలీలు నిర్వహించాలని నిర్ణియంచారు.  ప్రస్తుత ప్రభుత్వం ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకున్న ప్రభుత్వమని ఆయన అంటున్నారు.  ఈ ప్రభుత్వాన్ని తాము అంగీకరించబోమని స్పష్టంచేశారు. ఈ చర్యకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించడం ద్వారా ప్రజల తమ వైఖరిని తెలిపారని అన్నారు. ప్రతిసారీ ఒక ప్రధానమంత్రిని తొలగించినప్పుడు ప్రజలు పండగ జరుపుకుంటారు కానీ తనను పదవి నుండి తొలగిస్తే ప్రజలు నిరసనలు చేస్తున్నారని అన్నారు.

అతని కంట్లో ఈగల కాపురం - గుడ్లు కూడా పెట్టేశాయి ! తర్వాతేం జరిగింది ?

అయితే తనను పదవి నుండి తొలగించే సమయంలో శనివారం అర్ధరాత్రి వరకు న్యాయస్థానం తలుపులు ఎందుకు తెరిచి ఉంచారని ప్రశ్నించారు. దాని వెనుక ఉన్న ఉద్దేశాన్ని తెలపాలని డిమాండ్‌ చేశారు. పాకిస్తాన్‌ తనకు 45 సంవత్సరాలుగా తెలుసునని, తాను ఎప్పుడైనా చట్టాన్ని ఉల్లంఘించానా అని ప్రశ్నించారు. తాను క్రికెట్‌ ఆడినప్పుడు ఎవరైనా తనను మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డానని ఆరోపించారా  అని అడిగారు. షహబాజ్ షరీఫ్‌పై రూ.40 వేల కోట్ల విలువైన అవినీతికి పాల్పడినట్లు కేసులున్నాయి. అందుకే ఆయన్ను ప్రజలు అంగీకరించని  స్పష్టం చేశారు. ఇమ్రాన్‌ను పదవి నుంచి తప్పించడానికి 57 శాతం మంది పాకిస్థానీలు సానుకూలత వ్యక్తం చేయగా.. 43 శాతం మంది వ్యతిరేకించారని పాకిస్తాన్‌లో ఓ సర్వే వెల్లడించింది.

పదవి నుంచి దింపేసే వరకూ పాకిస్తాన్ ఆర్మీ తటస్థంగా ఉంది . అయితే పాకిస్తాన్ ఆర్మీలోని సీనియర్లు మాత్రం ఇమ్రాన్ ఖాన్ పై సానుభూతితో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.  అయితే ఇప్పటికే  ప్రభుత్వం మారిపోయింది. అయినప్పటికీ... ప్రజాగ్రహాన్ని కొత్త ప్రధాని షరీఫ్ వైపు మళ్లించి మళ్లీ పీఠాన్ని పొందాలన్న ప్రయత్నాలను ఇమ్రాన్ చేస్తున్నారు. 

Continues below advertisement