Afghanistan US porn star: తాలిబన్లు ఇప్పుడు ఆప్ఘనిస్థాన్ పాలకులు. వారు మహిళలకు ఇచ్చే గౌరవం ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. మహిళల్ని మనుషులుగా కూడా చూడరు. ఏ పని చేసినా తప్పే అంటారు. కానీ  వారు ఓ పోర్న్ స్టార్ ను ప్రత్యేకంగా తమ దేశానికి ఆహ్వానించారు. ఇప్పుడీ విషయం హాట్ టాపిక్ అవుతోంది. అమెరికాకు చెందిన పోర్న్ స్టార్ , సినీ నటి విట్నీ రైట్ ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌ను సందర్శించారు. తన సందర్శన విశేషాలను ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. 



ఈ వీడియో సొంత మహిళల పట్ల తాలిబన్లు వ్యవహరిస్తున్న తీరు.. విదేశీ పోర్న్ స్టార్ పట్ల వ్యవహిరంచిన తీరు చర్చనీయాంశమయింది.  ఆఫ్ఘనిస్తాన్‌లో విట్నీ రైట్ ఉనికి చాలా మందిని ఆశ్చర్యపరిచింది.   మహిళల స్వేచ్ఛను  తాలిబాన్లు అసలు సహించరు.  ఆఫ్ఘన్ మహిళలు పాఠశాలకు వెళ్లడం,  పనిచేయడం , పార్కులు , జిమ్‌ల వంటి బహిరంగ ప్రదేశాలను  సందర్శించడం కూడా నిషేధం.  అయినప్పటికీ ఒక విదేశీ పోర్న్ నటి   స్వేచ్ఛగా తిరిగేందుకు తాలిబన్లు అనుమతి ఇచ్చారు.   ఆఫ్ఘన్ లో కూడా ఈ అంశంపై విమర్శలు వస్తున్నాయి.  మహిళా హక్కుల కార్యకర్తలు తాలిబన్ల ద్వంద్వ నీతిని ప్రశ్నిస్తున్నారు.  



విట్నీ రైట్ పర్యటనపై  తాలిబన్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.  అయితే ఆమెను దేశంలోకి ఎలా అనుమతించారని చాలామంది ప్రశ్నిస్తున్నారు. భద్రతా ప్రమాదాల కారణంగా ఆఫ్ఘనిస్తాన్‌కు వెళ్లవద్దని అమెరికా ప్రభుత్వం తన పౌరులకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. కానీ విట్నీ రైట్ ఆఫ్గన్ వెళ్లడమే కాదు..  గన్స్ తో ఫోటోలకు ఫోజులిచ్చారు. మహిళలు తమ దేశంలో స్వేచ్చగా ఉన్నారని చెప్పడానికి  తాలిబన్ వ్యూహాత్మకంగా విదేశీ పర్యాటకులను ఉపయోగిస్తోందని కొందరు  అంచనా వేస్తున్నారు.  



ఐక్యరాజ్యసమితి , అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) లింగ ఆధారిత హింసకు సంబంధించి తాలిబన్ నాయకులపై దర్యాప్తు చేస్తున్నాయి.  కొంతమంది అధికారులు అరెస్టు వారెంట్లను కూడా ఎదుర్కొంటున్నారు.