US Iran War Power Plants Day: ఇరాన్ విద్యుత్ వ్యవస్థ ఆ దేశ ఆర్థిక, సామాజిక మనుగడకు వెన్నెముక వంటిది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇరాన్ కు ఉన్న పవర్ ప్లాంట్ల సామర్థ్యం ఎంత..  దాడి చేస్తే ఏం జరుగుతుంది? 

Continues below advertisement

 పవర్ ప్లాంట్ల  సామర్థ్యం 100 గిగావాట్లు

ఇరాన్ ప్రస్తుతం దాదాపు  100 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. దేశవ్యాప్తంగా వందలాది చిన్న, పెద్ద విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో మెజారిటీ సుమారు 80%  సహజ వాయువు  ఆధారంగా పనిచేసేవి. మిగిలినవి జల విద్యుత్, చమురు , అణు విద్యుత్ కేంద్రాలు. ఇరాన్ తన విద్యుత్ అవసరాల కోసం ప్రధానంగా గ్యాస్ గ్రిడ్‌పైనే ఆధారపడి ఉంది.

Continues below advertisement

 ఆయువుపట్టు లాంటి కీలక కేంద్రాలు  ఇరాన్ విద్యుత్ వ్యవస్థలో కొన్ని ప్లాంట్లు అత్యంత వ్యూహాత్మకమైనవి.  దమావంద్ పవర్ ప్లాంట్:  టెహ్రాన్ సమీపంలో ఉన్న ఇది ఇరాన్‌లోనే అతిపెద్దది సుమారు 2,868 MW . దీనిపై దాడి జరిగితే రాజధాని టెహ్రాన్ చీకటిలో మునిగిపోతుంది. బుషెహర్  అణు విద్యుత్ కేంద్రం:  ఇది ఇరాన్   ఏకైక కార్యాచరణ అణు రియాక్టర్. ఇది కేవలం విద్యుత్తునే కాకుండా, ఇరాన్ అణు సామర్థ్యానికి చిహ్నంగా నిలుస్తుంది. షాహిద్ సలీమి  , షాహిద్ రాజా యీ:  ఇవి ఉత్తర ఇరాన్‌కు కీలకమైన విద్యుత్ కేంద్రాలు. బందర్ అబ్బాస్ ప్లాంట్: ది స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ సమీపంలో ఉండి, తీరప్రాంత పారిశ్రామిక అవసరాలను తీరుస్తుంది.

 అమెరికా దాడి చేస్తే జరిగే పరిణామాలు 

ఒకవేళ అమెరికా ఈ పవర్ ప్లాంట్లపై దాడులు చేస్తే, అది కేవలం ఇరాన్ సైన్యంపైనే కాకుండా సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఆస్పత్రులలో లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ ఆగిపోతాయి, నీటి శుద్ధి ప్లాంట్లు పనిచేయవు, దీనివల్ల స్వచ్ఛమైన తాగునీటి కొరత ఏర్పడి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. ఆహార నిల్వలు పాడైపోవడం వల్ల దేశంలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడవచ్చు.

 వ్యూహాత్మ,  పర్యావరణ ముప్పు 

ముఖ్యంగా బుషెహర్ అణు ప్లాంట్ పై దాడి జరిగితే రేడియోధార్మికత వెలువడే ప్రమాదం ఉంది. ఇది కేవలం ఇరాన్‌నే కాకుండా పక్కనే ఉన్న గల్ఫ్ దేశాలైన కువైట్, ఖతార్, యూఏఈలను కూడా ప్రభావితం చేస్తుంది. సముద్రపు నీరు కలుషితమైతే ఆయా దేశాల్లోని డీశాలినేషన్  ప్లాంట్లు ఆగిపోయి భారీ నీటి సంక్షోభం తలెత్తుతుంది. 

 ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం 

ఇరాన్ విద్యుత్ గ్రిడ్ దెబ్బతింటే, అది ఆ దేశ చమురు,  గ్యాస్ ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా రవాణా ఖర్చులు పెరిగి, అన్ని దేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. ట్రంప్ ఈ దాడులను ఒక 'మైండ్ గేమ్'గా వాడుతున్నప్పటికీ, అది వాస్తవ రూపం దాల్చితే అటు మానవీయంగా, ఇటు ఆర్థికంగా ప్రపంచం భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది.