US IRAN WAR:  అమెరికా “రెడ్ లైన్స్” దాటితే, తమ ప్రతిస్పందన ప్రాంతం దాటి విస్తరిస్తుందని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) హెచ్చరించింది, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  తాజా బెదిరింపుల మధ్య  ఇరాన్ ప్రతిఘటన ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది. ఈ అర్ఖరాత్రి తర్వాత ఏం జరుగుతోందో అన్న ఆందోళనను ఇరాన్ రియాక్షన్ మరింత పెంచింది. ఇరాన్ ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న మీడియా ద్వారా ఈ ప్రకటన వెలువడింది, హోర్ముజ్ జలసంధిపై తాము చెప్పినట్లు వినకపోతే ఇరాన్‌ను సర్వనాశనం చేస్తామంటూ వాషింగ్టన్ హెచ్చరికలు చేస్తున్న తరుణంలోనే ఈ సమాధానం వెలువడింది. పరిస్థితి అదుపు తప్పితే, తెహ్రాన్ మిత్రపక్షాలు బాబ్ ఎల్-మండెబ్ జలమార్గం మూసివేయడానికి కూడా కదలవచ్చని  ఇరానియన్ వర్గాలు రాయిటర్స్‌తో తెలిపాయి, ఇది గనుక జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాకు అంతరాయం జరుగుతుదని భయాలు రేకెత్తుతున్నాయి. 

IRGC హెచ్చరిక

ఇరాన్ తమతో చర్చలు జరుపుతోందని.. తమ షరతులకు లొంగుతుందని కొన్ని రోజులుగా ట్రంప్ చేస్తున్న ప్రచారం ఒట్టిదే అని తేలిపోయింది. తమ మాట వినకపోతే.. ఇరాన్ నాగరికతే లేకుండా చేస్తామన్న తీవ్రమైన హెచ్చరికలు IRGC లక్ష్య పెట్టలేదు. అమెరికా తమపై దాడి చేస్తే.. రిటార్ట్ అదే రీతిలో ఉంటుందని IRGC తెలిపింది. ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడి జరిగితే, అది కేవలం ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా మరింత విస్తరిస్తుందని హెచ్చరించింది.

అమెరికా ఎలాగైతే.. తమ పవర్‌హౌస్‌లను, బ్రిడ్జిలను కూల్చేస్తామని చెబుతోందో అదే రీతిలో అమెరికా, దాని మిత్ర దేశాల చమురు రిఫైనరీలను ధ్వంసం చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇరానియన్ దళాల పరిధిని, సామర్థ్యాన్ని అమెరికా నాయకులు తక్కువ అంచనా వేస్తున్నారని  దానికి ఫలితం కూడా అనుభవిస్తారని హెచ్చరించారు.

వెనక్కి తగ్గని ట్రంప్ 

కొన్ని రోజులుగా ప్రతి రోజూ.. ఇరాన్ ను టార్గెట్ చేస్తున్న ట్రంప్.. మరోసారి అదే స్థాయిలో హెచ్చరికలు చేశారు. తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో ఒక పోస్ట్‌లో, పరిస్థితి మరింత దిగజారితే ఒక మొత్తం నాగరికత నాశనం అవుతుందని కూడా ట్రంప్ హెచ్చరించారు.ప్రపంచ చరిత్రలో ఇది అత్యంత ముఖ్యమైన క్షణాలలో ఒకటిగా అభివర్ణిస్తూ, ఒక ప్రధాన మలుపు రాబోతోందని ఆయన సూచించారు. 

పెరుగుతున్న ఉద్రిక్తతలుహార్ముజ్ జలసంధిపై తన మొండి పట్టుదలను ఇరాన్ వీడనాడాలంటూ ట్రంప్ విధించిన గడువు భారత కాలమాం ప్రకారం బుధవారం తెల్లవారుజాముకు ముగుస్తుంది. ఇప్పటికే అమెరికా భారీ వైమానిక దాడికి సన్నద్ధమవుతోంది. పెద్ద సంఖ్యలో బాంబర్లు, F-35లు ఇరాన్‌వైపు వెళుతున్నాయి. తెల్లారే సరిక ఏం జరుగుతోందో అన్న ఆందోళన పెరుగుతోంద. ఈ పరిస్థితిల్లో ఇరాన్ వ్యాఖ్యలు పరిస్థితిని మరింత తీవ్రం చేశాయి,