US Election Results 2024 | వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ మంగళవారం ప్రారంభమైంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ (Kamala Harris) పోటీ పడుతున్నారు. ఒకరు మాజీ అధ్యక్షుడు, కాగా మరో అభ్యర్థి ఉపాధ్యక్షురాలు. అమెరికా టైమ్ ప్రకారం నేటి ఉదయం 7 నుంచి 9 గంటలకు మధ్య పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు ఓటింగ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30లకు అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ మొదలైంది. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. రెండు రోజుల్లో పూర్తి ఫలితాలు రానున్నాయి. అయితే తొలి 24 గంటల ఫలితాలు అభ్యర్థులకు కీలకం కానున్నాయి. నూతన ప్రెసిడెంట్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
తొలి ఫలితం ఉత్కం‘టై’
నవంబర్ 5 ఉదయం అమెరికాలో పోలింగ్ ప్రారంభం కాగా, ఓ చిన్న కౌంటీలో ఓట్ల లెక్కింపు సైతం పూర్తయ్యింది. న్యూహ్యాంప్‌షైర్ లోని డిక్స్‌విల్లే నాచ్‌లో అమెరికా ఎన్నికల ఫస్ట్ రిజల్ట్ వచ్చేసింది. డిక్స్‌విల్లే నాచ్‌లో మొత్తం ఆరుగురు ఓటర్లు ఉండగా, కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ నకు చెరో 3 ఓట్ల చొప్పున వచ్చాయి. తొలి ఫలితం వచ్చాక అమెరికా ప్రజలు ఎన్నికల ఫలితాలపై మరింత ఆసక్తిగా చూస్తున్నారు. అమెరికా గత అధ్యక్ష ఎన్నికల్లో డిక్స్‌విల్లే నాచ్ లో మెజార్టీ ఓట్లు డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ కు రాగా, విజయం సాధించి అగ్రరాజ్యానికి అధ్యక్షుడు అయ్యారు. మొత్తం 538 సీట్లు ఉండగా, కనీసం 270 సీట్లు సాధించిన వారు అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చుంటారు. నాలుగేళ్లపాటు పదవిలో కొనసాగుతారు.
Also Read: US Presidential Election 2024: యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
స్వింగ్ రాష్ట్రాల్లో పోల్ సర్వే డేటా
రాష్ట్రం | కమలా హారిస్ ఓట్ల శాతం | డోనాల్డ్ ట్రంప్ ఓట్ల శాతం |
నెవాడా | 46 | 49 |
నార్త్ కరోలినా | 48 | 46 |
విస్కాన్సిన్ | 49 | 47 |
జార్జియా | 48 | 47 |
పెన్సిల్వేనియా | 48 | 48 |
మిచిగాన్ | 47 | 47 |
అరిజోనా | 45 | 49 |
అమెరికా- కెనడా సరిహద్దులో డిక్స్‌విల్లే నాచ్ ఉంటుంది. ఈ పోలింగ్ స్టేషన్లో నలుగురు ఓటర్లు రిపబ్లికన్ పార్టీ తరఫున నమోదు చేసుకోగా, మరో ఇద్దరు మాత్రం ఏ పార్టీకి మద్దతుగా నమోదు చేసుకోలేదు. ఎలక్షన్ డే వీరంతా స్థానిక బాల్‌సామ్స్ హోటల్‌లో సమావేశమై అమెరికా జాతీయ గీతం ఆలపిస్తారు. అనంతరం ఒక్కొక్కకుగా ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఓటింగ్ పూర్తయిన 15 నిమిషాల తర్వాత ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. దాదాపు ఆరు దశబ్దాల నుంచి ఇక్కడ అర్ధరాత్రి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. తాజాగా జరుగుతున్న పోలింగ్ లో తొలి ఫలితం కావడంతో అమెరికా ప్రజలు డిక్స్‌విల్లే నాచ్ రిజల్ట్ ను గమనిస్తూ ఉంటారు. నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, మిచిగాన్ ప్రజలకు భారీ సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనాలని ట్రంప్ పిలుపునిచ్చారు. అమెరికాను మరోసారి అగ్రభాగంలో నిలిపేలా అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదం ఇచ్చారు ట్రంప్.
Also Read: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లలలో బెంగాలీ భాష - ఎందుకో తెలుసా ?