Ugandan men seek DNA paternity tests: ఆఫ్రికా దేశం ఉగాండాలో ఇప్పుడు ప్రధాన వ్యాపారం డీఎన్ఏ టెస్టులు, పత్రికలు, రేడియాలు, సోషల్ మీడియాలో డీఎన్ఏ టెస్టులు సరసమైన ధరలకు చేయబడునని విపరీతమైన ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం అక్కడి మగవాళ్లంతా తమకు పుట్టిన పిల్లలు నిజంగా తమకే పుట్టారా అన్న డౌట్ తో నిర్దారించుకునేందుకు లక్షలు ఖర్చు పెట్టుకునేందుకు వెనుకాడకపోవడమే. 

Continues below advertisement

పిల్లలకు తండ్రి తామే అని నిర్దారించుకోవాలన్న తపన 

ఉగాండా అనే ఆఫ్రికా దేశంలో ఇప్పుడు ఒక పెద్ద సమస్య తలెత్తింది.  చాలా మంది భర్తలు  నా పిల్లలు నిజంగా నావారేనా అన్న అనుమానంతో అల్లాడిపోతున్నారు. అందుకే డీఎన్‌ఏ టెస్టులు చేయించుకుంటున్నారు. నిజానికి ఓ వివాహబంధంలో పుట్టిన పిల్లలను అనుమానిస్తే.. ఉగాండా గ్రామీణ ప్రాంతాల్లో అలాంటి వారికి జరిమానా విధించేవారు. కానీ ఇప్పుడు మారుతున్న కాలంతో కాస్త ఆర్థికంగా స్థిరపడిన కుటుంబాల్లో మగవాళ్లు తమ పిల్లలకు తామే తండ్రి అని నిర్దారించుకోవాలనుకుంటున్నారు. అలాంటి వారి కోసం.. డీఎన్ఏ టెస్టులు అందుబాటులోకి వచ్చాయి. 

Continues below advertisement

టెస్టులు చేయించుకుంటే 98 శాతం పిల్లలకు తండ్రులు వేరు

ఉగాండాలో డీఎన్ఏ టెస్టు   ధర సుమారు 1.5–2 లక్షల రూపాయలు ఉంటుంది. గ్రామాల్లో చాలా మందికి డబ్బు లేక టెస్టుల వరకూ వెళ్లడం లేదు. కానీ పట్టణాల్లో టెస్టులు  చేసయిస్తున్న వారిలో  98 శాతం మంది ఫలితం పిల్లలు డీఎన్‌ఏతో తండ్రి డీఎన్‌ఏ సరిపోలడం లేదని వస్తోంది. దీంతో కుటుబాలు విచ్చిన్నమవుతున్నాయి.  ర్యాభర్తల మధ్య గొడవలు, కొట్లాటలు, విడాకులు పెరిగిపోయాయి. పిల్లలు పుట్టాక చాలా సంవత్సరాల తర్వాత కూడా ఈ పరీక్షలు జరుగుతున్నాయి. ఆస్తి పంపకాలు, వారసత్వం విషయాల్లో ఈ రిపోర్టులు ఆధారంగా నే నిర్ణయాలు తీసుకుంటున్నారు. 

కుటుంబాలను నిలబెట్టేందుకు చర్చి పాస్టర్ల ప్రయత్నాలు

డీఎన్ఏ టెస్టుల వల్ల పెద్ద ఎత్తున వివాహాలు విచ్చిన్నమవుతూండటంతో గ్రామ నాయకులు, పెద్దలు నచ్చ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ వద్ద పంచాయతీకి వచ్చే జంటలను సముదాయించడం వారి వల్ల కావడం లేదు.  గతంలో ఇలాంటి అనుమానం వచ్చినా మా మధ్యలో మాట్లాడించి సర్దిచెప్పేవాళ్లుం. ఇప్పుడు DNA రిపోర్ట్ వచ్చాక ఎవరూ వినడం లేదని వారంటున్నారు.  చర్చి పాస్టర్లు, బిషప్‌లు  ఇంట్లో పుట్టాడు అంటే మీ పిల్లవాడే... యేసు కూడా జోసెఫ్‌కి సొంతం కాదు కదా… అయినా జోసెఫ్ పెంచాడు” అని బోధిస్తున్నారు. ఉగాండా ప్రభుత్వం గుండె ధైర్యం ఎక్కువగా ఉన్నవారే టెస్టులు చేయించుకోవాలని లేకపోతే వద్దని ప్రచారం చేస్తోంది.             

భవిష్యత్ భయానకం

టెస్టులు చేయిస్తున్న వారిలో 98 శాతం మందికి పిల్లలు తమ పిల్లలు కాదని తెలుస్తూండటమే అసలు సంచలనంగా మారింది.నేరాల పెరుగుదలకు కారణం అవుతున్నాయి. ఆస్తి గొడవలు పెద్దలవుతున్నాయి. డీఎన్ఏ టెస్టుల డిమాండ్  పెరుగుతూండటంతో ..  ఆస్పత్రులు ధరలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో ఈ టెస్టులు చేయిచుకునేవారి సంఖ్య పెరుగుతుందని అంటున్నారు. ఇదే జరిగితే మొత్తం ఉగాండా కుటుంబ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.