Imran Khan mystery deepens: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం, భద్రతపై ఆందోళనలు మరింత తీవ్రమవుతున్నాయి. అడియాలా జైలులో బందీగా ఉన్న ఇమ్రాన్ ను చంపేశారని ప్రచారం జరిగింది.కానీ పాక్ ప్రభుత్వం, మిలటరీ అధికారులు ఖండించారు. ఆయన క్షేమంగా ఉన్నారని అంటున్నారు. అయితే చూపించడం లేదు.
ఇమ్రాన్ కుమారుడు కాసిమ్ ఖాన్ ఏదో జరిగి ఉండవచ్చు అని భయపడుతున్నారు. మూడు వారాలుగా కుటుంబానికి ప్రూఫ్ ఆఫ్ లైఫ్ , కోర్టు ఆదేశాల ప్రకారం ములాఖత్‌లు కూడా ఇవ్వకపోవడంతో మరిన్ని అనుమానాలు బలపడుతున్నాయి. ఇమ్రాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) సభ్యులు, సోదరులు జైలు బయట నిరసనలు చేస్తున్నారు. అంతర్జాతీయంగా ఈ అంశం చర్చనీయమవుతోంది.
లండన్‌లో నివసించే ఇమ్రాన్ కుమారుడు కాసిమ్ ఖాన్ అంతర్జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలో ఇప్పటి వరకు మా తండ్రి గురించి ఎటువంటి నిజమైన సమాచారం లేదని స్పష్టం చేశారు. తండ్రి సురక్షితంగా ఉన్నారా, గాయపడ్డారా, లేదా జీవించి ఉన్నారా కూడా తెలియడం లేదని ఆందోళన వ్య్కంతే చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించడానికి ఇమ్రాన్ పర్సనల్ డాక్టర్ ప్రయత్నించారు. కానీ అనుమతి ఇవ్వడంలేదు. ఇమ్రాన్ మొదటి భార్య, బ్రిటిష్ ఆర్టిస్ట్ జెమిమా గోల్డ్‌స్మిత్ కూడా ఫోన్ మీటింగ్‌లు కూడా అనుమతించటం లేదని ఆరోపించారు.
ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి అడియాలా జైలులో ఉన్నారు. తొలి ఆర్మీ చీఫ్‌తో లీక్‌లు, టోటా చట్టం, దుర్వినియోగం వంటి 20కి పైగా కేసులు ఆయనపై ున్నాయి. ఇవి అతన్ని ఎన్నికల నుంచి దూరం చేయడానికి రాజకీయ కుట్రలు పన్నారని అంటున్నారు. ప్రస్తుతం, ఇమ్రాన్‌ను జైలు మార్చారని అంటున్నారు. ఇది కుటుంబ ఆందోళనలను మరింత పెంచింది. కాసిమ్ చివరిసారి తండ్రిని 2022 నవంబర్‌లో హత్యాయత్నం తర్వాత చూశారు. పాకిస్తాన్ ఇంటీరియర్ మినిస్ట్రీ ఈ ఆరోపణలపై స్పందించ లేదు.
ఇమ్రాన్ ఖాన్ ను క్షేమంగా బయటకు చూపించకపోతే పాకిస్తాన్ లో జెన్ జీ ఆందోళనలు జరిగే అవకాశం ఉంది. దాంతో ప్రభుత్వం .. కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తోంది.