Nobel Peace Prize Trump disappointed: నోబెల్ శాంతి బహుమతికి తన కంటే అర్హుడు లేడని పదే పదే నోబెల్ కమిటీకి సంకేతాలు పంపి.. పాకిస్తాన్ లాంటి దేశాలతో నామినేట్ చేయించుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు షాక్ తగిలింది. ఆయనకు శాంతి బహుమతి దక్కలేదు. ఎనిమిది యుద్ధాలు ఆపానని చెప్పడమే కాదు చాలా దేశాల నుంచి తన పేరు నామినేట్ చేయించుకున్నారు. చివరికి ఒక రోజు ముందుగా ఇజ్రాయెల్, గాజా శాంతి ఒప్పందం చేయించారు. కానీ ఆయన పేరునుపట్టించుకోలేదు.
అడిగితే ఇవ్వరు.. అర్హత ఉంటే ఇస్తారు
నోబెల్ శాంతి బహుమతి కావాలి అని చిన్నపిల్లాడు మారం చేసినట్లుగా మారం చేశారు ట్రంప్. ఎక్కడ యుద్ధం జరిగినా తానే ఆపానని ప్రకటించుకుంటూ వచ్చారు. ఆయన జనవరిలో అధ్యక్ష బాధ్యతలు చేపడితే.. ఆరు నెలలు తిరిగే సరికి ఎనిమిది యుద్ధాలు వచ్చాయి. ఎనిమిందింటిని ఆపేశారు. ఇది ఆయన చెప్పుకున్నదే. కానీ ఎవరూ తమ మధ్య యుద్ధంలో ట్రంప్ జోక్యం చేసుకున్నారని .. ఆపేశారని చెప్పలేదు. చివరికి పాక్ కూడా చెప్పలేదు. కానీ పాక్ ఆయనను నోబెల్ కు సిఫారసు చేసింది. ఆ దేశానికి అది తప్పదు. కానీ ట్రంప్ నకు అర్థం అయినా అర్థం కానిట్లుగా వ్యవహరించారు ఎందుకంటే ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కు అయినా నోబెల్ కమిటీ లొంగుతుందనే.
ట్రంప్ వల్లనే ప్రపంచంలో అశాంతి
శాంతి బహుమతి అంటే దానికో విశేషమైన అర్థం ఉంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుండి అశాంతి సృష్టిస్తూనే ఉన్నారు. అత్యంత స్వార్థపూరితమైన విధానాలతో ప్రపంచంలోని అనేక దేశాలను ఇబ్బంది పెడుతున్నారు. సొంత ప్రజల జీవన ప్రమాణాల్ని తగ్గించేశారు. ఆయన దెబ్బకు అమెరికా ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ఇతర దేశాలతో ఆయన దురుసుగా ప్రవర్తిస్తున్నారు. కెనడాని కలుపుకుంటానని.. పనామా కాలువను లాగేసుకుంటానని చెబుతూంటారు. హమాస్ ను బెదిరించి సంతకం చేయించారు కానీ.. అలా చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదని ఆయన గుర్తించడం లేదు. మొత్తంగా ట్రంప్ వల్ల శాంతి ఏమీ లేకపోగా.. ఎక్కవగా అశాంతి ఏర్పడుతోందని ఎక్కువ మంది నమ్ముతున్నారు.
ట్రంప్ ఇప్పుడేం చేస్తారు?
ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తారనేది అందరిలో వస్తున్న ఆలోచన. ఎందుకంటే ఆయన ప్రతీకార మనస్థత్వంలో ఉండే అధ్యక్షుడు. నార్వేపై సుంకాలు విధిస్తారా అన్న చర్చలు వస్తున్నాయి. అలాగే ఎదురుదాడి చేస్తారని .. నోబెల్ విలువను తగ్గించేలా మాట్లాడతారని అందరికీ తెలుసు . అయితే ట్రంప్ నకు ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడు నోబెల్ శాంతి బహుమతి రాదని కాదు. ఆయన పాలనలో నిజంగా శాంతి ఏర్పడిందని భావిస్తే.. వచ్చే ఏడాది లేకపోతే .. ఆ తర్వాత అయినా నోబెల్ కమిటీ గుర్తిస్తుంది. అలా కాకుండా అశాంతితో రగిలిపోతే ఎప్పటికీ చాన్స్ ఉండకపోవచ్చు.