Philippines Earthquake: ఫిలిప్పీన్స్ లోని మిండావో ప్రాంతంలో 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం తరువాత అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని కూడా తెలిపారు. యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) ప్రకారం, భూకంపం లోతు 62 కిలోమీటర్లు (38.53 మైళ్ళు). స్థానిక అధికారులు తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు. అత్యవసర సేవలకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ప్రభుత్వ సూచనలను పాటించాలని పౌరులను కోరారు.
Philippine Institute of Volcanology and Seismology (Phivolcs) ప్రకారం, తొలి సునామీ అలలు అక్టోబర్ 10, 2025 ఉదయం 09:43:54 నుండి 11:43:54 (PST) మధ్య రావచ్చు ఈ అలలు చాలా గంటల పాటు కొనసాగవచ్చు.
ఫివోల్క్స్ ప్రకారం, అలలు సాధారణ అలల స్థాయి కంటే ఒక మీటరు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తున ఎగసిపడొచ్చని తెలుస్తోంది. ఇరుకైన జలమార్గాల్లో ఇవి మరింత ఎత్తుకు కూడా చేరుకోవచ్చు. భూకంపం డావో ఓరియంటల్ లోని మనయ్ పట్టణానికి సమీపంలో సముద్ర ప్రాంతంలో ఏర్పడింది.