Richest Women In World: ప్రపంచంలోని ధనవంతుల గురించి ప్రస్తావించినప్పుడల్లా, జాబితాలో పురుషుల పేర్లు ఎక్కువగా ఉంటాయి. అది బిల్ గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్ లేదా ఎలాన్ మస్క్ కావచ్చు కావచ్చు. ధనవంతుల పేర్లు చెప్పగానే మగవారి పేర్లు మాత్రమే తెరపైకి వస్తాయి. అయితే ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళ ఎవరు అంటే, టక్కున సమాధానం రాదు. ప్రపంచంలో అత్యంత ధనవంతులైన 10 మంది మహిళల్లో మన దేశానికి చెందిన మహిళ సైతం ఉన్నారు. 


ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్


ఫ్రాన్స్ నివాసి అయిన  ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళ. వీరి మొత్తం నికర విలువ $97.5 బిలియన్లు. 70 సంవత్సరాల వయస్సున్న ఈమె, L'Oréal అనే కంపెనీకి యజమాని. ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తులలో 15వ స్థానంలో ఉన్నారు.


ఆలిస్ వాల్టన్


అమెరికాకు చెందిన 74 ఏళ్ల అలిస్ వాల్టన్ అత్యంత సంపన్న మహిళల జాబితాలో రెండవ స్థానంలో ఉన్నారు. మొత్తం నికర విలువ $71.5 బిలియన్లు. వీరి కంపెనీ పేరు వాల్మార్ట్. ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఈమె 21వ స్థానంలో ఉన్నారు. ఆలిస్ వాల్టన్ క్రిస్టల్ బ్రిడ్జెస్ మ్యూజియం ఆఫ్ అమెరికన్ ఆర్ట్ చైర్మన్ గా ఉన్నారు.


జూలియా కోచ్


అమెరికాకు చెందిన 61 ఏళ్ల జూలియా కోచ్ సంపన్న మహిళల జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. మొత్తం నికర విలువ $61.4 బిలియన్లు. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో కోచ్ ఇండస్ట్రీస్ కంపెనీ యజమాని జూలియా కోచ్ 24వ స్థానంలో నిలిచారు.


జాక్వెలిన్ మార్స్


జాక్వెలిన్ మార్స్ ప్రపంచంలోని నాల్గవ సంపన్న మహిళ. ధనవంతుల జాబితాలో జాక్వెలిన్ మార్స్ 34వ స్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన 84 ఏళ్ల జాక్వెలిన్ మార్స్ తన స్వీట్, పెంపుడు జంతువుల వ్యాపారం నిర్వహిస్తున్నారు. వీరి మొత్తం నికర విలువ $38.7 బిలియన్లు.


మెకెంజీ స్కాట్


US నివాసి అయిన 53 ఏళ్ల మెకెంజీ స్కాట్ $36.1 బిలియన్ల యజమాని. ఆమె ప్రసిద్ధ కొరియర్ భాగస్వామి అమెజాన్ కంపెనీ యజమాని. మొత్తం ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో 43వ స్థానంలో నిలిచారు.


మిరియం అడెల్సన్ 


మిరియం అడెల్సన్ అనే 78 ఏళ్ల US మహిళ. ధనవంతుల జాబితాలో ఆరవ స్థానంలో ఉన్నారు. ఈమె క్యాసినోల యజమాని. వీరి మొత్తం నికర విలువ $34.5 బిలియన్లు మరియు ధనవంతుల జాబితాలో 45వ స్థానంలో ఉన్నారు.


సావిత్రి జిందాల్


భారత్‌కు చెందిన సావిత్రి జిందాల్ ఒక ఉక్కు కంపెనీ యజమాని. ధనవంతుల జాబితాలో ఆమె ఏడవ స్థానంలో ఉన్నారు. భారతీయ సంపన్న మహిళల జాబితాను పరిశీలిస్తే, ఆమె నంబర్ వన్ స్థానంలో నిలిచారు. 73 ఏళ్ల సావిత్రి జిందాల్ 31.1 బిలియన్ డాలర్లకు యజమాని. ఈమె జిందాల్ గ్రూపునకు చెందినవారు . కాగా, ప్రపంచ ధనవంతుల జాబితాలో ఆమె 49వ స్థానంలో నిలిచారు.


గినా రైన్‌హార్ట్


ఆస్ట్రేలియా నివాసి అయిన 70 ఏళ్ల గినా రైన్‌హార్ట్ సంపన్న మహిళల జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచారు. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 52వ స్థానంలో ఉన్న గినా రైన్‌హార్ట్ మొత్తం సంపద $30.3 బిలియన్లు.


బిగైల్ జాన్సన్ 


అమెరికాకు చెందిన 62 ఏళ్ల బిగైల్ జాన్సన్ సంపన్న మహిళల జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచారు.  ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 54వ స్థానంలో ఉన్న బిగైల్ జాన్సన్ మొత్తం సంపద $29.7 బిలియన్లు.


రాఫెలా అపోంటే-డైమంట్ 


స్విట్జర్లాండ్‌కు చెందిన 78 ఏళ్ల మహిళ రాఫెలా అపోంటే-డైమంట్ స్విట్జర్లాండ్ మొత్తం నికర విలువ $28.7 బిలియన్లు. సంపన్న మహిళల జాబితాలో పదో స్థానం. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఆమె 57వ స్థానంలో ఉన్నారు.