నమస్తే, నమస్కారం లేదా నమస్కార్ వంటి ఈ పదాలు నమస్సు నుంచి ఉద్భవించింది. నమస్సు లేదా " నమః " అనగా "మనిషిలో ఉన్న ఆత్మ"ను గౌరవించడం అని అర్థం. ఈ సంప్రదాయము భారతదేశంతో పాటు దక్షిణాసియాలో ఎక్కువగా వాడుకలో ఉంది. ప్రత్యేకంగా హిందూ, జైన, బౌద్ధ మతాన్ని అనుసరించే వారిలో ఈ సంప్రదాయం కనిపిస్తోంది. ప్రపంచ సంస్కృతులలో ఎదుటి మనిషిని గౌరవించడం గొప్ప సంస్కారంగా పరిగణిస్తుంటారు. అయితే మన దేశంలో ఏవిధంగా అయితే చేతులు జోడించి నమస్కరిస్తామో... ప్రపంచంలోనే చాలా దేశాల్లో ఒక్కో విధంగా, విచిత్రకరమైన నమస్కారాలతో స్వాగతం పలుకుతుంటారు. పెద్దవాళ్లకు లేదా తమ దేశానికి వచ్చిన విదేశీ పర్యాటకులకు లేదా ఇంటికి వచ్చిన అతిథులకు నమస్కారం చేస్తుంటాం. అయితే నమస్కారం అంటే రెండు చేతులను జోడించి చేస్తేనే నమస్కారం అనుకుంటే మాత్రం పొరపాటే. ఎందుకు చాలా దేశాల్లో చాలా చిత్రవిచిత్రంగా నమస్కరించి, స్వాగతం పలుకుతుంటారు. అలాంటి కొన్ని దేశాల సంబంధించిన నమస్కార సాంప్రదాయాలు ఇలా ఉన్నాయి.


నమస్కారానికి వివిధ పద్ధతులు:
ప్రపంచంలోని ప్రతి దేశానికి ఆయా ప్రత్యేక సంస్కృతి, ఆచారాలు ఉంటాయి. ఇంటికి వచ్చిన అతిథులను అందరూ తమదైన రీతిలో గౌరవిస్తారు. మన దేశానికి అతిథి వస్తే రెండు చేతులను జోడించి ‘నమస్తే’ అంటాం, నమస్కారం అని కూడా చెబుతుంటారు. కానీ కొన్ని చోట్ల చాలా భిన్నంగా నమస్కరించే సంప్రదాయం ఉంది. ఇంటికి వచ్చిన అతిథులు కావొచ్చు.. లేదా తమ దేశానికి టూరిస్టులకు నాలుకను చూపించి, వాసన చూసి స్వాగతం పలికి.. వారిని గౌరవించే సంప్రదాయం ఓ దేశంలో ఉంది. ఇంతకీ ఈ ట్రెడిషన్‌ ఏంటి.? ఇలా ఎందుకని నాలుక చూపిస్తూ.. వాసన చూస్తూ స్వాగతం పలుకుతారో తెలుసా..


నాలుక చూపిస్తూ స్వాగతం:
టిబెట్‌లో అపూర్వమైన స్వాగతం, గౌరవం లభిస్తుంది. మీరు ఎప్పుడైనా టిబెట్‌కు వెళ్లి ఎవరైనా నాలుక బయటపెట్టి చూపిస్తే, మిమ్మల్ని ఆట పట్టించడానికి ఇలా చేస్తున్నారని అనుకుంటే మాత్రం పొరపాటే. ఎందుకంటే, ఇక్కడ నాలుకను చూపించి స్వాగతం పలికి గౌరవించే విశిష్ట సంప్రదాయం ఉంది. ఇలా స్వాగతించే ఆచారం శతాబ్ద కాలంగా కొనసాగుతోంది. అయితే నిజానికి 9వ శతాబ్దంలో టిబెట్‌ను పాలించిన లాంగ్‌ ధర్మారాజు ఎంతో క్రూరమైన వ్యక్తి. అయితే అతడి నాలుక నల్లగా ఉండేదంటా. అందుకని టిబెట్ ప్రజలు తమ నాలుకను బయటపెట్టి, తమను కలిసిన వ్యక్తులకు ఆ రాజుతో తమకు సంబంధం లేదని చెప్పేందుకు ఇలా నాలుకను బయటకు తీసి మరీ స్వాగతం పలుకుతారు. అప్పటినుంచి ఈ సంప్రదాయం ఇంకా కొనసాగుతోంది.


అతిథి వాసన చూస్తూ స్వాగతం:
టిబెట్ మధ్య ఆసియాలోని ఒక పీఠభూమి ప్రాంతమే టిబెట్‌. ఇది భారతీయ సంతతికి చెందిన టిబెట్ వాసుల నివాస ప్రాంతమనే చెప్పాలి. ప్రాచీనులు దీనిని త్రివిష్టపము అని పిలిచేవారు. అందమైన సముద్ర తీరం వద్ద ఇది ఉంటుంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంగా "ప్రపంచపు పైకప్పు"గా ప్రసిద్ధి చెందినది.  టిబెట్‌కు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి టూరిస్టులు భారీ మొత్తంలో వస్తుంటారు. ఇలా వచ్చిన అతిథి ముఖాన్ని నొక్కడం, నాలుక బయటకు పెట్టి వారి సువాసనను గాఢంగా పీల్చడం ఇక్కడ ఒక ప్రత్యేకమైన సంప్రదాయంగా ఉంది. 


పలు దేశాల్లో విచిత్రమైన స్వాగతాలు:
ఒక్క టిబెట్‌లోనే కాదు.. చాలా దేశాల్లో ఇలాంటి ఆచారాలు ఉన్నాయి. విదేశీ టూరిస్టులు వచ్చినప్పుడు వారి దేశ సంప్రదాయం ప్రకారం స్వాగతించి, గౌరవించి పలకరించే మార్గాలు కూడా విభిన్నంగా ఉంటాయి. మన దేశంలో చేతులు జోడించి నమస్కరిస్తారు. కానీ అదే పాకిస్తాన్‌ దేశంలో తల వంచడాన్ని అదాబ్ అని అంటారు. గ్రీన్‌ల్యాండ్ దేశంలో అయితే అతిథుల ముక్కులు రుద్ది స్వాగతం పలుకుతారు. ఇక ఫ్రాన్స్, ఉక్రెయిన్‌లలో చెంపపై ముద్దు పెడుతూ స్వాగతం పలుకుతారు. ఏది ఏమైనప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా చేతులు జోడించి, నమస్కారం పెట్టి గౌరవిస్తూ స్వాగతించడం అనేది.. అత్యంత ప్రాచుర్యం పొందిందనే చెప్పాలి. ప్రపంచ వేడుకల్లో కూడా చాలా మంది కరచాలనం చేస్తూ స్వాగతం పలుకుతారు.