Covid-19 Surge: ఆ దేశాల నుంచి వచ్చే వాళ్లకు RT PCR టెస్ట్‌లు తప్పనిసరి, ప్రకటించిన కేంద్రం

Covid-19 Surge: విదేశీ ప్రయాణికులకు RT PCR టెస్ట్‌లు తప్పనిసరి చేస్తూ కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది.

Continues below advertisement

Covid-19 Surge:

Continues below advertisement

ఆ ఐదు దేశాల ప్రయాణికులపై నిఘా..

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుక్ మాండవియా ఈ మేరకు అధికారిక ఓ ప్రకటన చేశారు. చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంగ్‌కాంగ్, థాయ్‌లాండ్‌  దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా RT PCR టెస్ట్‌లు చేయాలని ఆదేశించారు. అన్ని విమానాశ్రయాల్లోనూ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ ప్రయాణికుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలున్నా...పాజిటివ్‌ అని తేలినా వెంటనే క్వారంటైన్‌ చేయాలని స్పష్టం చేశారు. ఈ దేశాల నుంచి వచ్చే వాళ్లు తప్పనిసరిగా Air Suvidh ఫామ్‌లలో ప్రస్తుత ఆరోగ్య స్థితికి సంబంధించిన అన్ని వివరాలు తెలియ జేయాలని కేంద్రం వెల్లడించింది. 

 

Continues below advertisement