Gold Tea : చాయ్ అంటే చాలా మందికి అదో ఒక ఎమోషనల్ లా ఫీల్ అవుతూ ఉంటారు. మరెంతో మందికి చాయ్ లేనిదే రోజు స్టార్ట్ కాదు. ఫ్రెండ్స్ తో బయటికెళ్లినా, ఫ్యామిలీతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నా చాలా మందికి గుర్తొచ్చేది చాయే. ఇంత ఇంపార్టెన్స్ ఉన్న చాయ్ ధర ఎంతుంటుంది.. సాధారణంగా అయితే రూ. 10 లేదా రూ. 20 ఉంటుంది. ఫైవ్ స్టార్ హోటల్‌ వంటి కొన్ని ప్రాంతాలను బట్టి దాని ధర రూ.500 కూడా ఉంటుంది. అయితే మనం చెప్పుకోబోయేది వందలో, వేలో కాదు ఏకంగా రూ.1లక్ష విలువ చేసే టీ గురించి. పూర్తి వివరాల్లోకి వెళితే..


ఓ ఇండియన్ కేఫ్‌లో లభించే ఈ కప్పు టీ ధర అక్షరాలా రూ.లక్ష. అవును మీరు చదివింది నిజమే. కానీ ఇంత వాల్యూ చేసేంతగా ఇందులో ఏముంది.. ఈ కేఫ్ ఎక్కడుంది.. అసలు ఎందుకంత ధర అని ఆలోచిస్తున్నారా.. ఆ విషయానికొస్తే.. ఈ కేఫ్ దుబాయ్ లో ఉంది. ఈ టీని బంగారంతో తయారు చేసి, వెండి కప్పులో అందిస్తారు. సోషల్ మీడియా పుణ్యామా అని ఈ టీకి క్రేజ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.


వెండి కప్పులో టీ 


ఈ కేఫ్ పేరు బోహో కేఫ్. దీని యజమాని సుచేతా శర్మ. AED 5000 అంటే మన కరెన్సీలో సుమారు 1.14 లక్షలన్నమాట. ఈ టీ 24 క్యారెట్ల బంగారంతో తయారు చేసి, స్వచ్ఛమైన వెండి కప్పులో సర్వ్ చేస్తారు. టీ తాగాక కస్టమర్లు ఈ కప్పును తమ వద్ద ఉంచుకోవచ్చట. ఇదే కాదు ఇక్కడి మెనులోని ఇతర ప్రీమియం ఐటెమ్‌లలో గోల్డ్ సావనీర్ కాఫీ, గోల్డ్ డస్టెడ్ క్రోసెంట్స్, గోల్డ్ డ్రింక్స్, గోల్డ్ ఐస్ క్రీం వంటి వెరైటీ డ్రింక్స్ కూడా ఉన్నాయి.


లగ్జరీని ఇష్టపడే వారి కోసం విభిన్నంగా ఏదైనా రూపొందించాలనుకున్నాం’’ అని సుచేతా శర్మ తెలిపారు. 'రాయల్ మెనూ'లోని ఇతర ఆఫర్‌లలో గోల్డ్ సావనీర్ కాఫీని వెండి పాత్రలో అందిస్తామన్నారు. కస్టమర్లు కప్పును ఇంటికి కూడా తీసుకెళ్లవచ్చని చెప్పారు. దీని ధర AED 4,761 అంటే సుమారు రూ.1.09 లక్షలు అని స్పష్టం చేశారు.


వీడియోలో ఏముందంటే..


ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియో ఓ వెండి కప్పులో చాయ్ పోసి.. దానిపై చిన్న చిన్న ముక్కలుగా చేసిన 24 క్యారెట్ల బంగారు రేకులను చల్లారు. ఆ తర్వాత టీపై బంగారు పూతను పూశారు. దాన్నంతటినీ ఓ వెండి కప్పులో సర్వ్ చేసి అందించారు. దీంతో పాటు కేఫ్ వ్యూను కూడా చూపించారు. 






సోషల్ మీడియాలో రియాక్షన్స్ 


ఈ కేఫ్ వీడియోను ఫుడ్ వ్లాగర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో అతను ఈ టీ గురించి అన్ని విషయాలను చెప్పాడు. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. "ఈ టీ తాగాలంటే EMI తీసుకోవాలేమో' అని ఒక యూజర్ రాశారు. ఇక మరొకరేమో.. "ఇది పెద్ద దోపిడీ. వెండి వస్తువులు, బంగారు షీట్లతో తయారు చేసినా కూడా దీనికి 700 AED కంటే ఎక్కువ ఖర్చు కాదు. దీనికి 5000 AED వసూలు చేయడం హాస్యాస్పదంగా ఉంది" అని ఆరోపించారు.  


Also Read : దోశలు వేసుకొని నెలకు 6 లక్షల సంపాదన- ఇతన్ని చూసి కుళ్లుకోని వాళ్లు ఉండరేమో!