ఆకాశంలో ఈ రోజు అద్భుతం చూశారా? చంద్రుడు మాములుగా కన్నా మరింత ప్రకాశవంతంగా పెద్దగా కనిపించాడు కదా. దీన్నే సూపర్ మూన్ అంటారు. కారణం ఏంటంటే చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చాడు. సాధారణంగా భూమికి, చంద్రుడికి మధ్య దూరం 3 లక్షల 84 వేల 400 కిలోమీటర్లు ఉంటుంది. సూపర్ మూన్ టైమ్ లో ఈ దూరం తగ్గి 3 లక్షల 61 వేల 934 కిలో మీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. సూపర్ మూన్ ఏడాదికి ఒక సారే వస్తుందా అంటే కాదు..


సౌరమాన క్యాలెండర్, చంద్రమాన క్యాలెండర్ వేరు కాబట్టి.. ఏడాదికి 12 సూపర్ మూన్స్ ఉంటాయి. ఒక్కో ఏడాది 13 ఉంటాయి. ఈ ఏడాది కూడా 13సార్లూ సూపర్ మూన్ చూడొచ్చు. ఈ ఎక్స్ ట్రా వచ్చే సూపర్ మూన్ నే బ్లూ మూన్ అంటారు. మరి ఇవాళ వచ్చినదాన్ని బక్ మూన్ అంటున్నారు కదా.. అదేంటీ అంటే.. ఇదివరకూ నేచర్ ని అబ్జర్వ్ చేస్తూ మన ఏన్ సిస్టర్స్ స్పేస్ ని కూడా అబ్జర్వ్ చేసేవాళ్లు.






వాళ్లకు మన భూమి మీద కనిపించే వస్తువులతో ఖగోళాన్ని చూస్తూ అలా ఊహల్లో నుంచి కొన్ని పేర్లు పెట్టుకుంటూ వచ్చేవాళ్లు. నక్షత్రరాసులకు ఎలా అయితే పేర్లున్నాయో... మేషం, మకరం, మీనం అని.. అలానే బక్ మూన్ కూడా. లేడికి కొమ్ములు బాగా పెద్దవయ్యే కాలం కాబట్టి.. జులై మూన్ ను బక్ అని మూన్ అని పిలవటం మొదలుపెట్టారని కెనడియన్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది. కేవలం జులై లో సూపర్ మూన్ కే కాదు.. ఇదిగో ఇలా ప్రతి నెలలో వచ్చే సూపర్ మూన్ కి ఓ పేరుంటుంది. ఈ సారి బక్ మూన్ ను వరల్డ్ వైడ్ సెలబ్రేట్ చేశారు. కెమెరాలు ఉన్న వాళ్లు ఇదిగో ప్రపంచ ప్రఖ్యాత ప్రదేశాల నుంచి బక్ మూన్ ఫోటోలు తీసి ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు.