ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిన శ్రీలంకను ( Sri lanka ) బయటపడేసేందుకు అధ్యక్షుడు గోటబయ రాజపక్సే పదిహేడు మంది మంత్రుల్ని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇప్పటి వరకూ మంత్రులుగా బాధ్యతలు తీసుకోవడానికి చాలా మంది వెనుకాడారు. కానీ ఇప్పుడు ఒక్క సారే పదిహేడు మంది అంగీకరించారు. వారందరితో ప్రమాణ స్వీకారం కూడా చేయించారు. ప్రెసిడెంట్ రాజపక్సేగా  ( Rajapakes ) బాధ్య‌తలు చేప‌ట్టిన త‌రువాత ఇది మూడో కేబినెట్ విస్త‌ర‌ణ‌.  ( Cabinet Ministers ) ఎనిమిది మందికి గతంలో మంత్రులుగా చేసిన అనుభవం ఉంది. మిగతా వారంతా కొత్త వాళ్లే. 

ఒక నిమ్మకాయ రూ.60- శ్రీలంకకు ఎందుకు ఈ దుస్థితి? తెలుగు రాష్ట్రాల పరిస్థితేంటి? శ్రీలంక దేశం చెత్త ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది . విదేశీ మార‌క ద్ర‌వ్యం కొర‌త ఏర్ప‌డ‌టంతో ఆహారం, ఇంధనం, మెడిసిన్ దిగుమ‌తిపై తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. దీంతో శ్రీలంక మిత్ర దేశాల నుంచి అవ‌స‌ర‌మైన వ‌స్తువుల‌ను సాయం కోరాల్సి వ‌స్తోంది. అత్యవసర సాయం కోసం శ్రీలంక అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ( IMF ) నుండి $ 4 బిలియన్ల బెయిలౌట్ ప్యాకేజీని కోరుతోంది. ఇందుకోసం శ్రీలంక ప్రతినిధి బృందం అమెరికా వెళ్లింది. కొత్తగా నియమితుడైన ఆర్థిక మంత్రి అలీ సబ్రీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఏప్రిల్ 19-24 మధ్య ఐఎంఎఫ్‌తో చర్చలు జరపనుంది. ప్రస్తుతం తీవ్రమైన  విదేశీ మారక ద్రవ్య సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.  

సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ రాజీనామా- విపక్షాలకు అధ్యక్షుడి బంపర్ ఆఫర్

ఆర్థిక పరిస్థితి కారణంగా ప్రధాని మహింద రాజపక్స, అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేయాలనే డిమాండ్లతో భారీ నిరసనలు వెల్లువెత్తాయి. అంతకు ముందు ప్రధాని మహీందా రాజపక్స జాతిని ఉద్దేశించి ప్రత్యేకంగా ప్రసంగించారు. ప్ర‌జలు ఓపిక ప‌ట్టాల‌ని కోరారు. ఈ ప‌రిస్థితి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌ని, ప్ర‌జ‌లు వీధుల్లోకి రావ‌డం మానేయాల‌ని అభ్యర్థించారు. ఆర్థిక సంక్షోభం నేప‌థ్యంలో శ్రీలంక  ప్రభుత్వ యాజమాన్యంలోని పెట్రోలియం కంపెనీ వాహనాలకు ఇంధన కోటాను నిర్ణయించింది. ఓ పరిమితి మేరకు పెట్రోల్ కొనగలరు. మరో వైపు ఆర్థిక సాయం అందించేందుకు భారత్ కూడా అంగీకరించింది.  2 బిలియన్ల డాల‌ర్ల వ‌ర‌కు ఆర్థిక సాయం చేసేందుకు సిద్ధంగా ఉంది. కొత్త ఆర్థిక మంత్రి ప్రయత్నాలతో శ్రీలంక కనీసం ఊపిరి పీల్చుకునే పరిస్థితి అయినా వస్తుందని అక్కడి ప్రజలు ఆశిస్తున్నారు.