మొన్న అఫ్గానిస్థాన్, నిన్న ఉక్రెయిన్.. నేడు శ్రీలంక.. ఈ మూడు దేశాలు వివిధ కారణాల వల్ల తీవ్ర ఆర్థిక సంక్షోభాల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే సరిహద్దు దేశాలు సాయం కోరక ముందే భారత్ ఆపన్నహస్తం అందిస్తూ ఉంటోంది. అయితే తాజాగా శ్రీలంక ఆహార, ఆర్థిక సంక్షభాల్లో చిక్కుకుంది. దీంతో భారత్ సాయం చేయాలని ఆ దేశ నేతలు కోరుతున్నారు.
తమ మాతృభూమిని కాపాడమని, వీలైనంత ఎక్కువ సహాయాన్ని అందించాలని ప్రధాని నరేంద్ర మోదీకి శ్రీలంక ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమదాస విజ్ణప్తి చేశారు. సోమవారం భారత్‌కు చెందిన ఒక జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్ సాయం
సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు భారత్ పెద్ద ఎత్తున సాయం అందిస్తోంది. 2.5 బిలియన్ డాలర్ల సాయంతో పాటు లక్షల టన్నుల ఇంధనం, బియ్యం కూడా పంపింది.
ఆంక్షల వలయంలో
ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంకలో తాజాగా నిరసనలు పతాకస్థాయికి చేరాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రం కావడంతో దేశంలో ఇప్పటికే సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధించారు. తాజా సంక్షోభం తమ ప్రభుత్వ నిర్ణయాల వల్ల కాదని, కొవిడ్ మూలంగా ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిని విదేశీ మారక నిల్వలు కరిగిపోయాయని రాజపక్స ప్రభుత్వం చెబుతోంది.
ధరల మోత
శ్రీలంకలో ప్రస్తుత ధరలు చూస్తే కళ్లు పైర్లు కమ్ముతాయి. కోడి గుడ్డు రూ.35, లీటర్ కొబ్బరి నూనె రూ.900, కిలో చికెన్ రూ.1000, కిలో పాల పొడి రూ.1945.. ఇవి ప్రస్తుతం శ్రీలంకలో నిత్యవసర ధరల పరిస్థితి. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో నిత్యావసరాల ధరలు అమాంతం ఆకాశన్నంటాయి. నిత్యావసరాలు, ఆహార పదార్థాలపై ప్రభుత్వ నియంత్రణ సన్నగిల్లడం వల్ల చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో వాటి ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రస్తుతం డాలర్‌తో శ్రీలంక కరెన్సీ విలువ 270 రూపాయలకు చేరింది. ఫలితంగా నిత్యవసర వస్తువులతో పాటు ఇంధనం, గ్యాస్ ధరలు అందనంత ఎత్తుకు వెళ్లిపోయాయి.
Also Read: Fact Check : పంజాబ్ కొత్త సీఎం బైక్ దొంగనా ? ఇదిగో నిజం
Also Read: Hijab Row: విద్యార్థుల నుంచి టీచర్లకు చేరిన హిజాబ్ వివాదం- ప్రభుత్వం కీలక ఉత్తర్వులు