Small Capsule Missing: ఆస్ట్రేలియా ఓ వింత సమస్యను ఎదుర్కొంటోంది. కనిపించకుండా పోయిన ఓ చిన్న క్యాప్సూల్ ఆస్ట్రేలియా మొత్తాన్ని నిద్రలేకుండా చేస్తోంది. పశ్చిమ ఆస్ట్రేలియాలో 8 మిల్లీమీటర్ల రేడియోధార్మిక క్యాప్సూల్ అదృశ్యమైందన్న వార్త సంచలనంగా మారుతోంది. ఇప్పుడు ఆ క్యాప్సూల్ ఎక్కడ ఉందని సెర్చ్ ఆపరేషన్ మొదలైంది.
రేడియోధార్మిక క్యాప్సూల్‌తో కూడిన ట్రక్కు పశ్చిమ ఆస్ట్రేలియాలోని రియో టింటో గని నుంచి పెర్త్‌కు వెళ్తోంది. కానీ అది పెర్త్‌కు చేరుకోలేదు. మార్గమధ్యంలో అకస్మాత్తుగా మాయమైంది. అది కనిపించకుండా పోయినప్పటి నుంచి ఆస్ట్రేలియాలో కలకలం రేగింది. రెండు నగరాల మధ్య దూరం 1,400 కిలోమీటర్లు కాబట్టి దాన్ని కనుగొనడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు.
క్యాప్సూల్‌ను తాకడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి.
ఆ క్యాప్సూల్ కోసం గాలింపు కొనసాగుతోందని ప్రభుత్వం చెబుతోంది. ముందుజాగ్రత్తగా ఎక్కడైనా కనిపిస్తే కనీసం 16 అడుగుల దూరం పాటించాలని ఆస్ట్రేలియా ప్రజలను అధికారులు హెచ్చరించారు. ఈ క్యాప్సూల్ చాలా ప్రమాదకరం. ఈ రేడియోధార్మిక క్యాప్సూల్ పరిమాణం గురించి మాట్లాడితే, ఇది నాణెం కంటే చిన్నది. దీని పొడవు 8 మిమీ, వెడల్పు 6 మిమీ. ఇది రేడియోధార్మిక సీసం-137తో నిండి ఉంటుంది. దీన్ని ఎవరైనా తాకితే తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్యాప్సూల్ గంటకు 10 ఎక్స్ రేలకు సమానంగా రేడియేషన్ శక్తి వెలువడుతుందని అధికారులు చెబుతున్నారు. అందుకే ఈ క్యాప్సూల్ నుంచి 16 అడుగుల దూరం పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎవరైనా పొరపాటున అనుకోకుండా ఈ క్యాప్సూల్‌ను తాకితే వారికి చర్మ సంబంధింత అలర్జీ వస్తుంది. క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఈ క్యాప్సూల్ గురించి అగ్నిమాపక, అత్యవసర సేవల విభాగం (డిఎఫ్ఇఎస్) ఆదివారం మాట్లాడుతూ... ఈ క్యాప్సూల్‌ను ఎవరూ ఆయుధంగా ఉపయోగించలేకపోయినా, దాని రేడియేషన్ వల్ల ముప్పుగా ఉంటుందని తెలిపింది. అందుకే దీన్ని వీలైనంత త్వరగా గుర్తించాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు.