Powerful Passport In The World 2025 : అంతర్జాతీయంగా స్వేచ్ఛాయుత ప్రయాణాలను సూచించే పాస్స్ పోర్ట్ ర్యాంకింగ్ లను హెన్లీ పాస్ పోర్ట్స్ ఇండెక్స్ విడుదల చేస్తుంది. తాజా సమాచారం ప్రకారం, పాస్ పోర్ట్ ర్యాంకింగ్ లో సింగపూర్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఇండెక్స్ లో తరచూ సింగపూర్ అగ్ర స్థానం దక్కించుకోవడం ఒక రికార్డు. ఇందుకు కారణం ఆ దేశ పటిష్టమైన దౌత్య సంబంధాలు, దృఢమైన ఆర్థిక వ్యవస్థ, అక్కడి పౌరుల జీవన ప్రమాణాలు, స్వచ్ఛమైన పాలన అని చెప్పవచ్చు. ఈ కారణంగానే ఆ దేశ పౌరులు వీసా లేకుండా 193 దేశాలను చుట్టిరావచ్చు. హెన్లీ పాస్ పోర్ట్స్ఇండెక్స్‌లో టాప్ పది దేశాలు ఏవి, ఆ పట్టికలో ఇండియా ఏ స్థానంలో ఉంది, చివరలో ఏ దేశం ఉందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
హెన్లీ పాస్ పోర్ట్స్ ఇండెక్స్ 2025 (జులై నాటికి) - టాప్ 10 పాస్ పోర్ట్స్‌లు ఇవే:
1వ స్థానం:
సింగపూర్ (193 దేశాలకు వీసారహిత ప్రవేశం)
2వ స్థానంలో ఉన్న దేశాలు:
జపాన్ (190 దేశాలకు వీసారహిత ప్రవేశం)
దక్షిణ కొరియా (190 దేశాలకు వీసారహిత ప్రవేశం)
3వ స్థానంలో ఉన్న దేశాలు:
డెన్మార్క్ (189 దేశాలకు వీసారహిత ప్రవేశం)
ఫిన్లాండ్ (189 దేశాలకు వీసారహిత ప్రవేశం)
ఫ్రాన్స్ (189 దేశాలకు వీసారహిత ప్రవేశం)
జర్మనీ (189 దేశాలకు వీసారహిత ప్రవేశం)
ఐర్లాండ్ (189 దేశాలకు వీసారహిత ప్రవేశం)
ఇటలీ (189 దేశాలకు వీసారహిత ప్రవేశం)
స్పెయిన్ (189 దేశాలకు వీసారహిత ప్రవేశం)
4వ స్థానంలో ఉన్న దేశాలు:
ఆస్ట్రియా (188 దేశాలకు వీసారహిత ప్రవేశం)
బెల్జియం (188 దేశాలకు వీసారహిత ప్రవేశం)
లక్సెంబర్గ్ (188 దేశాలకు వీసారహిత ప్రవేశం)
నెదర్లాండ్స్ (188 దేశాలకు వీసారహిత ప్రవేశం)
నార్వే (188 దేశాలకు వీసారహిత ప్రవేశం)
పోర్చుగల్ (188 దేశాలకు వీసారహిత ప్రవేశం)
స్వీడన్ (188 దేశాలకు వీసారహిత ప్రవేశం)
5వ స్థానంలో ఉన్న దేశాలు:
గ్రీస్ (187 దేశాలకు వీసారహిత ప్రవేశం)
న్యూజిలాండ్ (187 దేశాలకు వీసారహిత ప్రవేశం)
స్విట్జర్లాండ్ (187 దేశాలకు వీసారహిత ప్రవేశం)
6వ స్థానంలో ఉన్న దేశం:
యునైటెడ్ కింగ్‌డమ్ (186 దేశాలకు వీసారహిత ప్రవేశం)
7వ స్థానంలో ఉన్న దేశాలు:
ఆస్ట్రేలియా (185 దేశాలకు వీసారహిత ప్రవేశం)
చెక్ రిపబ్లిక్ (185 దేశాలకు వీసారహిత ప్రవేశం)
హంగేరి (185 దేశాలకు వీసారహిత ప్రవేశం)
మాల్టా (185 దేశాలకు వీసారహిత ప్రవేశం)
పోలాండ్ (185 దేశాలకు వీసారహిత ప్రవేశం)
8వ స్థానంలో నిలిచిన దేశాలు:
కెనడా (184 దేశాలకు వీసారహిత ప్రవేశం)
ఎస్టోనియా (184 దేశాలకు వీసారహిత ప్రవేశం)
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (184 దేశాలకు వీసారహిత ప్రవేశం)
9వ స్థానంలో నిలిచిన దేశాలు:
క్రొయేషియా (183 దేశాలకు వీసారహిత ప్రవేశం)
లాట్వియా (183 దేశాలకు వీసారహిత ప్రవేశం)
స్లోవేకియా (183 దేశాలకు వీసారహిత ప్రవేశం)
స్లోవేనియా (183 దేశాలకు వీసారహిత ప్రవేశం)
10వ స్థానంలో నిలిచిన దేశాలు:
ఐస్‌లాండ్ (182 దేశాలకు వీసారహిత ప్రవేశం)
లిథువేనియా (182 దేశాలకు వీసారహిత ప్రవేశం)
యునైటెడ్ స్టేట్స్ (182 దేశాలకు వీసారహిత ప్రవేశం)
భారతదేశం పరిస్థితి: పాస్ పోర్ట్స్ఇండెక్స్ ప్రకారం, భారతదేశం వీసారహిత పాస్ పోర్ట్స్ ఇండెక్స్ లో 77వ స్థానంలో ఉంది. మన దేశ పాస్ పోర్ట్స్ ద్వారా 59 దేశాలను చుట్టిరావచ్చు. మన దేశం గత ఏడాదితో పోలిస్తే 8 స్థానాలు మెరుగుపడింది. గత ఏడాది వీసా రహిత పాస్ పోర్ట్స్ లలో మన దేశంది 85వ ర్యాంకు. ప్రతి ఏడాది నాటి పరిస్థితులను బట్టి దేశాల ర్యాంకింగ్ మారుతూ ఉంటుంది. ఇక ఈ పట్టికలో చివరి స్థానంలో, అంటే 99వ ర్యాంక్‌లో, అఫ్ఘానిస్థాన్ దేశం ఉంది. ఆ దేశ పాస్‌పోర్ట్ అత్యంత బలహీనమైన పాస్ పోర్ట్స్గు గా గుర్తించారు.