భారతీయ వ్యోమగామి శుభాంషు శుక్లాతో సహా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆక్సియం-4 (Ax-4) మిషన్ జూన్ 22కి వాయిదా వేశారు. ఈ విషయాన్ని మిషన్ చేపడుతున్న ప్రైవేట్ ఏరోస్పేస్ సంస్థ ఆక్సియం స్పేస్ వెల్లడించింది.
ఆక్సియం 4 మిషన్ ప్రారంభం ఎప్పుడు..
వాస్తవానికి ఈ జూన్ నెల మొదట్లో ఫ్లోరిడా నుండి ఆక్సియం4 మిషన్ ప్రారంభించాల్సి ఉంది. తుది తనిఖీలు, షెడ్యూల్ సర్దుబాట్ల కారణంగా ఆలస్యం జరిగింది. సోషల్ మీడియా అప్‌డేట్‌లో, ఆక్సియం స్పేస్ ఇలా పేర్కొంది, "#Ax4 సిబ్బంది వైద్య మరియు భద్రతా ప్రోటోకాల్‌లను నిర్వహించడానికి ఫ్లోరిడాలో క్వారంటైన్‌లో ఉన్నారు. సిబ్బంది ఆరోగ్యంగా మరియు ఉత్సాహంగా ఉన్నారు. ప్రయోగానికి ఎదురుచూస్తున్నారు!"
ఆక్సియం-4 మిషన్ తేదీని 2వ సారి మార్చారు
ఆక్సియం-4 మిషన్ ను జూన్ 11న షెడ్యూల్ చేశారు. గత వారం, మిషన్ జూన్ 19కి మార్చినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. భారతీయ వ్యోమగామి శుభాంషు శుక్లాను తీసుకువెళ్లే ఆక్సియం-4 మిషన్ ప్రయోగాన్ని జూన్ 19కి మార్చారని తెలిపారు.