Putin Warning:
అణు ప్రయోగాలు..
ఉక్రెయిన్‌పై సైనిక చర్య కొనసాగిస్తున్న రష్యా ఇటీవలే కొత్త మిజైల్‌ని ప్రయోగించడం సంచలనమవుతోంది. మిజైల్స్‌ని ప్రయోగించడం అనేది సాధారణమే కావచ్చు. కానీ...న్యూక్లియర్ ఎక్స్‌ప్లోజన్స్‌కి అవసరమైన ఆయుధాలనూ మోసుకెళ్లగలికే సామర్థ్యం ఈ మిజైల్‌కి ఉందన్న వార్తలే ఆందోళన కలిగిస్తున్నాయి. దాదాపు 3 దశాబ్దాలుగా రష్యా ఇలాంటి ప్రయోగాలు చేయలేదు. ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్న ఈ సమయంలో ఇలాంటి టెస్ట్‌లు చేయడం కలవర పెడుతోంది. పైగా రష్యా అధ్యక్షుడు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) కూడా దీనిపై స్పందించారు. రష్యా తొలిసారి న్యూక్లియర్ సామర్థ్యం కలిగిన మిజైల్ Burevestnik ని ప్రయోగించిందని వెల్లడించారు. వేలాది కిలోమీటర్ల మేరకు దూసుకెళ్లే కెపాసిటీ ఈ క్షిపణికి ఉందని వివరించారు. కొత్త తరం అణ్వాయుధాలు సిద్ధం చేసుకోవడంలో కీలకమైన సర్మత్ (Sarmat) ఇంటర్‌కాంటినెంటన్ బాలిస్టిక్ మిజైల్ సిస్టమ్‌కి సంబంధించిన పనులూ తుది దశకు చేరుకున్నట్టు స్పష్టం చేశారు. గతేడాది ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభించింది. అప్పటి నుంచి పుతిన్ నోట అణ్వస్త్రాల మాట చాలా సందర్భాల్లో వినిపించింది. మరే దేశం కూడా రష్యాపై అణ్వాయుధాలు ప్రయోగించాలన్న ఆలోచనే చేయకూడదన్న పట్టుదలతో ఉన్నారు పుతిన్. అందుకే చాలా సార్లు ఈ వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ ఎవరైనా ఆ పొరపాటు చేస్తే...నింగిలోకి తాము వందలాది మిజైల్స్‌ని వదిలి అందరినీ శత్రువులను మట్టుబెడతామని హెచ్చరించారు.
"మాపై దాడి చేసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే మా మిజైల్స్‌ని సిద్ధం చేసుకుంటాం. వందలాది క్షిపణుల్ని వదులుతాం. మేం దాడి చేయడం మొదలు పెడితే శత్రువుల్లో ఒక్కరు కూడా మిగలరు"
- వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తతలు..!
1990 నుంచి రష్యా ఇలా అణు ప్రయోగాలు చేయలేదు. అప్పటికే సోవియ్ యూనియన్ పతనమైపోయింది. కానీ...ఇప్పుడు మళ్లీ వీటిని యాక్టివ్ చేసేందుకు రెడీగానే ఉన్నామని తేల్చి చెప్పారు పుతిన్. న్యూక్లియర్ టెస్ట్‌లు చేయకూడదన్న కట్టుబాట్లు ఏమీ పెట్టుకోలేదని, తమ పార్లమెంట్ ఎప్పుడైనా అందుకు ఆమోదం తెలిపేందుకు సిద్ధంగానే ఉందని స్పష్టం చేశారు. అటు అమెరికా కూడా ఈ ప్రయోగాలు మొదలు పెడితే...రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదముంది.
ఇటీవల ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్...రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయ్యారు. ఇద్దరు సంచలన నేతలు ఒకే వేదిక పంచుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా కిమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధాన్ని సమర్థించారు. పశ్చిమ దేశాలతో పుతిన్ చేస్తోంది పవిత్ర యుద్ధం అని కితాబునిచ్చారు. ఉత్తర కొరియా, రష్యా కలిసి పశ్చిమ దేశాల సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొంటాయని తేల్చి చెప్పారు.
"రష్యా తమ భద్రత గురించి పోరాడుతోంది. తమ భూభాగాన్ని కాపాడుకోవడం కోసం యుద్ధం చేస్తోంది. ఇది కచ్చితంగా పవిత్ర యుద్ధమే. ఆధిపత్యవాదాన్ని అణిచివేస్తాం. రష్యా అధ్యక్షుడు పుతిన్ తీసుకునే ప్రతి నిర్ణయానికీ మేం మద్దతునిస్తాం"
- కిమ్ జోంగ్ ఉన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు
Also Read: కెనడా ప్రధాని ట్రూడోకి ఊహించని షాక్, దేశాన్ని నాశనం చేశావంటూ ఓ వ్యక్తి వాగ్వాదం