Russia Ukraine War | ఇస్తాంబుల్: నెలలు, ఏళ్లు గడుస్తున్నా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగియలేదు. ఈ క్రమంలో రెండు దేశాలు శాంతి చర్చలకు నిర్ణయం తీసుకున్నాయి. మాస్కో 2022 దాడి తర్వాత తొలిసారి రెండు దేశాల అధినేతలు ప్రత్యక్షంగా చర్చలు జరిపారు. అయితే శుక్రవారం జరిగిన ఈ శాంతి చర్చలు రెండు గంటల కన్నా తక్కువ సమయంలోనే ముగిశాయి. ఆ చర్చల సమయంలో 2 దేశాలు యుద్ధ ఖైదీల మార్పిడికి అంగీకరించాయి. అయితే యుద్ధాన్ని ముగించడానికి అవకాశాలపై ఎలాంటి చర్చలు జరిగినట్లు కనిపించడం లేదు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, పోలండ్ నేతలతో చర్చల ఫలితాలను చర్చించారని తెలుస్తోంది. "సంపూర్ణ, షరతులేని యుద్ధవిరామం, హత్యలకు ముగింపు"నకు ముందుకు రావాలని, లేని పక్షంలో మాస్కోపై "కఠినమైన ఆంక్షలు" విధించాలని జెలెన్ స్కీ ఎక్స్ వేదికగా కోరారు.
యుద్ధ ఖైదీలపై కుదిరిన ఒప్పందం
రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధి బృందాల ప్రకారం, కీవ్, మాస్కో సంక్షిప్త ఇస్తాంబుల్ చర్చలలో 1,000 మంది యుద్ధ ఖైదీలను పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడానికి అంగీకరించాయి. అదనంగా, ఉక్రెయిన్ ప్రతినిధి, రక్షణ మంత్రి రుస్టెమ్ ఉమెరోవ్ యుద్ధవిరామం, దేశ అధిపతుల మధ్య సమావేశం గురించి చర్చించాయని అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ధృవీకరించింది.
మరోవైపు, రష్యా అధ్యక్షుడి సలహాదారు వ్లాదిమిర్ మెడిన్స్కీ, రెండు వైపులా వివరణాత్మక యుద్ధవిరామ ప్రతిపాదనలను ఇవ్వడానికి అంగీకరించాయని తెలిపారు. ఉక్రెయిన్ అధినేత సమావేశం ఏర్పాటు చేయాలని కోరగా.. దానిని రష్యా పరిశీలిస్తోందని తెలిపారు.
రష్యా కొత్త డిమాండ్లను ప్రవేశపెట్టింది: ఉక్రెయిన్
రష్యా కొత్త, "అంగీకరించలేని డిమాండ్లను" చర్చల సమయంలో ప్రవేశపెట్టిందని ఉక్రెయిన్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అందులో విస్తారమైన భూభాగాల నుండి ఉక్రెయినియన్ దళాల ఉపసంహరణ డిమాండ్ ఉంది. ది అసోసియేటెడ్ ప్రెస్‌తో ఓ అధికారి మాట్లాడుతూ, ఈ షరతులు గతంలో డిమాండ్ చేసిన వాటిలో స్పష్టం చేశారు. ఉక్రెయిన్, ముఖ్యంగా తక్షణ యుద్ధవిరామం , దౌత్య చర్చలకు స్పష్టమైన మార్గాన్ని అన్వేషిస్తోంది. అమెరికా, యూరోపియన్ మిత్రదేశాలు, ఇతర దేశాల ప్రతిపాదనలతో శాంతి చర్చలకు ఉక్రెయిన్ నిర్ణయం తీసుకుందని ఆ అధికారి తెలిపారు.
ఇస్తాంబుల్‌లోని డోల్మాబాహ్చే ప్యాలెస్‌లో రెండు దేశాల ప్రతినిధి బృందాలు ఎదురుగా కూర్చుని చర్చలు జరిపారు. యుద్ధాన్ని ముగించడంపై చర్చలు జరిపారు. చర్చలు జరిపితేనే యుద్ధానికి ముగింపు పలకవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచనతోనే ఇరు దేశాలు శాంతి చర్చలకు వెళ్తున్నాయి. ఇటీవల ఉద్రిక్తతల సమయంలో భారత్, పాకిస్తాన్ సైతం కాల్పుల విరమణ ఒప్పందానికి పరస్పరం అంగీకరించాయి. దాంతో గత కొన్ని రోజులుగా ప్రశాంతంగా ఉంది. భారత్ దాడులతో తన తప్పు తెలుసుకున్న పాక్ కాల్పుల విరమణకు రిక్వెస్ట్ చేయగా కేంద్ర ప్రభుత్వం అందుకు ఓకే చెప్పింది.
టర్కీ విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్ చర్చలను ప్రారంభించారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఇరు దేశాల ప్రతినిధులను కోరారు. యుద్ధ విరామానికి ఆయన దేశాల మధ్య యుద్ధవిరామాన్ని వీలైనంత త్వరగా అవసరమని పిలిచారు. ఫిదాన్ సోషల్ మీడియా పోస్ట్‌లో POW మార్పిడిని "విశ్వాస చర్య"గా వర్ణించి, మరో దఫా చర్చలు జరపడానికి అంగీకరించాయని తెలిపారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ యుద్ధం కారణంగా భద్రత, రక్షణ, ప్రజల సమస్యలను పరిష్కరించడానికి 47 యూరోపియన్ దేశాల నేతలతో అల్బేనియాలోని తిరానాలో సమావేశం అవుతున్నారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రోన్, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్, యూకే ప్రధాని కీర్ స్టార్మర్, పోలాండ్ ప్రధాని ప్రధాని డొనాల్డ్ టస్క్‌లతో సమావేశాలు నిర్వహించారు.
"రష్యా యుద్ధాన్ని ముగించడానికి సిద్ధంగా ఉండే వరకు రష్యాపై ఒత్తిడి కొనసాగించాలి," అని జెలెన్స్కీ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. చర్చల సమయంలో ఐదుగురు నేతలతో ఉన్న ఫోటోను ఉక్రెయిన్ అధినేత జెలెన్ స్కీ షేర్ చేసుకున్నారు.