India Pakistan Tensions | భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గిన తర్వాత, ఇరు దేశాలు సరిహద్దుల్లో తమ సైన్యాన్ని తగ్గిస్తున్నాయి. అయితే, భవిష్యత్తులో ఉద్రిక్తతలు మళ్ళీ పెరిగే ప్రమాదం ఇంకా ఉందని పాకిస్తాన్ సైన్యం (Pakistan Army) జనరల్ సాహిర్ షమ్షాద్ మిర్జా హెచ్చరించారు. సింగపూర్‌లోని శాంగ్రి-లా డైలాగ్ ఫోరంలో పాల్గొన్న పాకిస్తాన్ మిర్జా ఆపరేషన్ గురించి మాట్లాడారు. ఇప్పటివరకూ అణ్వాయుధాలను ఉపయోగించే ప్రయత్నం ఏదీ జరగలేదు, కానీ పరిస్థితి ఇంకా కంట్రోల్ కాలేదన్నారు. ఆపరేషన్ సిందూర్ తరువాత ఇరుదేశాల మధ్య భయం మరింత పెరిగిందని, ఏ క్షణంలో ఏం జరుగుతుందో అంచనా వేయడం కష్టమేనన్నారు.
ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ప్రమాదకరంరాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జనరల్ సాహిర్ షమ్షద్ మిర్జా మాట్లాడుతూ.., "ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor), పాక్ దాడులతో భారీ నష్టం ఏదీ జరగలేదు. కానీ భవిష్యత్తులో ఏ సమయంలోనైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. సంక్షోభం తలెత్తిన సమయంలో రియాక్షన్ వేరేలా ఉంటుంది అని భారత్‌ను హెచ్చరించారు. అణ్వాయుధాలున్న పొరుగు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు ప్రమాదకరంగా ఉన్నాయని, ఏ క్షణంలో ఏం జరుగుతుంతో చెప్పలేం అంటూ సంచలన వ్యాక్యలు చేశారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK) పై ప్రస్తుతం రెండు దేశాలు ఫోకస్ చేశాయి. అది తమ ప్రాంతమేనని, తిరిగి స్వాధీనం చేసుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని భారత ప్రభుత్వం పదే పదే చెబుతోంది. మరోవైపు ఆ కాశ్మీర్ ప్రాంతం జోలికొస్తే చూస్తూ ఊరుకునేది లేదని.. అది తమ నియంత్రణలో ఉందని పాక్ జనరల్ స్పష్టం చేశారు. భారత్ చేపట్టే చర్యలు, తీసుకునే నిర్ణయాలతో భవిష్యత్తులో ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదం పొంచి ఉందన్నారు.
ఏప్రిల్ 22 తేదీ ముందు ఉన్న పరిస్థితి వచ్చేసిందిరెండు దేశాలు సరిహద్దుల్లో తమ సైనిక బలగాలను తగ్గించే ప్రక్రియను ప్రారంభించాయని పాకిస్తాన్ జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ సాహిర్ షమ్షద్ మిర్జా, అన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటిసారిగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు సాధారణ స్థితికి వచ్చాయి. ఏప్రిల్ 22 తేదీ ముందు ఉన్న సాధారణ స్థితి కనిపిస్తోంది. కానీ ఏ క్షణంలోనైనా ఉద్రిక్తతలు తలెత్తి, మరో ప్రమాదం ముంచుకు వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిధి దాటనంత వరకే అంతా సాధారణంగా ఉంటుందని, హద్దు మీరితే ధీటుగా బదులిస్తామని మిర్జా స్పష్టం చేశారు.
Also Read: PM Modi: పహల్గామ్ ఉగ్రవాద బాధిత కుటుంబాన్ని కలిసిన ప్రధాని, ఉగ్రవాదంపై పోరాటం ముగియలేదని ప్రకటన