International Organization for Mediation: చైనా ఇప్పుడు ఐక్యరాజ్యసమితికి ప్రత్యక్ష పోటీ ఇవ్వబోతోంది. శుక్రవారం (మే 30, 2025), డ్రాగన్ డజన్ల కొద్దీ దేశాలతో కలిసి కొత్త ప్రపంచ మధ్యవర్తిత్వ సమూహాన్ని ఏర్పాటు చేసింది. పాకిస్తాన్, ఇండోనేషియా, బెలారస్ సహా అనేక దేశాలు ఈ సమూహంలో చేరాయి.

చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, శుక్రవారం హాంకాంగ్‌లో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మీడియేషన్ (IOMED) స్థాపనపై ఒక సమావేశం జరిగింది. దీనికి ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, యూరప్‌లోని 85 దేశాలతోపాటు దాదాపు 20 అంతర్జాతీయ సంస్థల నుంచి దాదాపు 400 మంది ఉన్నత స్థాయి ప్రతినిధులు హాజరయ్యారు.

33 దేశాలు వ్యవస్థాపక సభ్యులుగా మారాయి

మంత్రిత్వ శాఖ ప్రకారం, వీటిలో 33 దేశాలు ఆ సమావేశంలోనే సంతకం చేసి దాని వ్యవస్థాపక సభ్య దేశాలుగా మారాయి. CPC సెంట్రల్ కమిటీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఈ వేదికపై మాట్లాడుతూ, పరస్పర అవగాహన, రాజీ స్ఫూర్తితో విభేదాలను పరిష్కరించుకోవడం, చర్చలు,  సంప్రదింపుల ద్వారా ఏకాభిప్రాయాన్ని సాధించడం, విన్‌విన్‌ మనస్తత్వంతో అభివృద్ధిని ప్రోత్సహించడం,  దార్శనిక విధానంతో సవాళ్లు పరిష్కరించడం కోసం చైనా ఎల్లప్పుడూ మాట్లాడుతూనే ఉంటుందని అన్నారు.

ఐక్యరాజ్యసమితితో పోటీ పడేందుకు చైనా సిద్ధమవుతోంది

అంతర్జాతీయ చట్ట రంగంలో IOMED స్థాపన ఒక ముఖ్యమైన అడుగు అని, అంతర్జాతీయ సంబంధాల చరిత్రలో గణనీయమైన ప్రాముఖ్యత కలిగి ఉందని శుక్రవారం చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో ప్రచురించిన ఒక ప్రకటనలో వాంగ్ అన్నారు. ఇది UN చార్టర్ ప్రయోజనాలు, సూత్రాలను కలిగి ఉందని, అంతర్జాతీయ మధ్యవర్తిత్వ రంగంలో చాలా కాలంగా ఉన్న సంస్థాగత అంతరాన్ని పూరిస్తుందని వాంగ్ అన్నారు.

వార్తా సంస్థ రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఈ సంస్థ ఏర్పాటు కోసం సంతకాలు పెట్టేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇండోనేషియా, పాకిస్తాన్, లావోస్, కంబోడియా, సెర్బియా దేశాలు పాల్గొన్నాయి. ఐక్యరాజ్యసమితితో సహా 20 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా హాజరయ్యారని భావిస్తున్నారు. మధ్యవర్తిత్వ సమూహం అంతర్జాతీయంగా చైనా ప్రభావాన్ని పెంచుతుందని, ప్రపంచ పాలనలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు మరింత దృఢమైన పాత్ర కల్పిస్తుందని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. అయితే దాని విజయం ఇంకా చూడాల్సి ఉందని రాయిటర్స్ తెలిపింది.

చైనీస్ అసోసియేషన్ ఆఫ్ హాంకాంగ్, మకావు స్టడీస్ సభ్యుడు చు కర్-కిన్ శుక్రవారం గ్లోబల్ టైమ్స్‌తో మాట్లాడుతూ, IOMED శాంతియుత, సామరస్యపూర్వక పరిష్కారానికి ఒక అధికారిక చిహ్నం, IOMED స్థాపన ప్రపంచ వివాద పరిష్కారానికి ఒక కొత్త అధ్యాయాన్ని యాడ్ చేస్తుందని అన్నారు.