Vivek Ramaswamy: 


ప్రెసిడెంట్ రేస్‌లో వివేక్ రామస్వామి..


రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గిస్తానని వెల్లడించారు. అంతే కాదు. వాషింగ్టన్‌లో America First Policy Instituteలో మాట్లాడే క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. దాదాపు 10 లక్షల మంది సిబ్బందిని తొలగిస్తానని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చీ రాగానే దీనికే ప్రాధాన్యత ఇస్తానని, చెప్పారు. మొదటి ఏడాది నుంచే ఈ పని మొదలు పెడతానని హామీ ఇచ్చారు. ఇదొక్కటే కాదు. దాదాపు 5 ఫెడరల్ ఏజెన్సీలను పూర్తిగా మూసేస్తామని ప్రకటించారు. అందులో అత్యంత కీలకమైన FBI ఉంది. దాంతో పాటు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ ఎడ్యుకేషన్‌నీ రద్దు చేస్తామని చెప్పారు. Nuclear Regulatory Commission, బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, టొబాకో, ఫైర్ ఆర్మ్స్ అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ (Firearms and Explosives), ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్‌మెంట్‌నీ మూసేస్తామని స్పష్టం చేశారు. ఇక FBI గురించి మాట్లాడుతూ...ఈ డిపార్ట్‌మెంట్‌లో అత్యవసరం కాని రోల్స్‌లో ఉన్న 20 వేల మంది ఉద్యోగులను తొలగిస్తానని చెప్పారు. వీరిలో 15 వేల మందికి వేరే డిపార్ట్‌మెంట్‌లలో ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. 






ఉక్రెయిన్‌ని నాటోలో చేర్చొద్దు..


నిజానికి చాలా మంది ఉద్యోగులు తమ బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించడం లేదని, అంత నైపుణ్యాలూ లేవని స్పష్టం చేశారు. ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకుని, మళ్లీ వాళ్లే ప్రభుత్వాన్ని నడిపించాలని...ఆ వ్యవస్థ రావాలని అభిప్రాయపడ్డారు. విదేశాంగ విధానంపైనా కీలక వ్యాఖ్యలు చేశారు వివేక్ రామస్వామి. చైనాకు దగ్గరయ్యే బదులు రష్యాతోనే సంప్రదింపులు జరిపి డీల్ కుదుర్చుకోవాలని సూచించారు. అటు రష్యా కూడా చైనా ట్రాప్‌లో పడకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని చెప్పారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఓ సయోధ్య కుదిర్చడంతో పాటు ఉక్రెయిన్‌ని నాటోలో చేర్చబోమన్న సంకేతాలివ్వాలని అన్నారు. అధ్యక్ష రేసులో ఉన్నప్పటికీ మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌ పరిపాలనా తీరుపై ప్రశంసలు కురిపించారు వివేక్. 


రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల్లో ట్రంప్‌కు బహిరంగంగా మద్దతిస్తున్న అభ్యర్థి వివేక్ రామస్వామి ఒక్కరే ఉన్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లగల సమర్థుడైన అలాంటి వ్యక్తికి నేను ఓటు వేయాలనుకుంటున్నానని రామస్వామి అన్నారు. జో బిడెన్ దీన్ని చేయగలడని తాను అనుకోబోనని, కమలా హారిస్ అతని తోలుబొమ్మ అని విమర్శించారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన ఇతర అభ్యర్థులతో తనకు విభేదాలు ఉండవచ్చని, అయితే తాను కూడా బిడెన్, హారిస్ కంటే మెరుగైన మార్గంలో అమెరికాను ప్రగతి పథంలోకి తీసుకెళ్లగలనని నమ్ముతున్నానని రామస్వామి అన్నారు.తైవాన్ దేశం విషయంలో అమెరికా అనుసరిస్తున్న విధానాన్ని వివేక్ రామస్వామి విమర్శించారు. తైవాన్‌కు సంబంధించి అమెరికా అనుసరిస్తున్న విధానం తైవాన్‌ను ఒక దేశంగా గుర్తించడంలో విఫలమైందని ఆయన అన్నారు. అదే సమయంలో, అమెరికా విధానంలో వ్యూహాత్మక సందిగ్ధత ఉందని, చైనా తైవాన్‌పై దాడి చేస్తే అమెరికా దానిని కాపాడుతుందా లేదా అనేది స్పష్టంగా లేదని అన్నారు. 


Also Read: సనాతన ధర్మాన్ని ముక్కలు చేయడమే వాళ్ల అజెండా, విపక్ష కూటమిపై ప్రధాని మోదీ ఫైర్