Viral News: ఈమధ్యకాలంలో విమాన ప్రయాణాలు తరచూ హాట్ టాపిక్ అవుతున్నాయి. విమానాల్లో వివిధ ఘటనలతో నిత్యం ఏదో ఒక ఎయిర్ లైన్స్ వార్త న్యూస్ లో నిలుస్తోంది. తాజాగా మరో విమానం వార్త వైరల్ అవుతోంది. ఆదివారం రాత్రి అమెరికా పనామాలోని టోకుమెను ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఒక విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఈ విమానం ఫ్లోరిడాలోని మియామీ నుంచి చిలీలోని శాంటియాగో విమానాశ్రయానికి వెళ్తోంది. లాథమ్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ విమానం.. 271 మంది ప్రయాణికులతో ఆదివారం సాయంత్రం వేళ బయలుదేరింది. విమానంలో గాల్లో తన గమ్యం వైపు దూసుకెళ్తోంది. టేకాఫ్ అయిన మూడు గంటల తర్వాత ఆ విమాన పైలట్ అయిన 56 ఏళ్ల కెప్టెన్ ఇవాన్ అందూర్ అస్వస్థతకు గురయ్యాడు. పైలట్ సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించగా కాస్తంతా కోలుకున్నాడు. ఆ తర్వాత కెప్టెన్ ఇవాన్ అందూర్ బాత్రూమ్ కు వెళ్లారు. బాత్రూమ్ కు వెళ్లి ఇవాన్ అందూర్ ఎంతకీ బయటకు రాలేదు. ఇంత సేపు వెళ్లడం ఏమిటని అనుమానించిన హోస్టెస్ వెళ్లి చూడగా.. పైలట్ కాస్త కింద పడిపోయి కనిపించాడు.


ఎయిర్ లైన్స్ సిబ్బంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు సమాచారం అందించారు. వారు దగ్గర్లోని పనామా నగరంలోని టోకుమెన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు అనుమతి ఇచ్చారు. వెంటనే కో పైలట్ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అక్కడి వైద్యుల బృందం పైలట్ ఇవాన్ అందూర్ ను పరిశీలించారు. అయితే పైలట్ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై లాథమ్ ఎయిర్ లైన్స్ స్పందించింది. కెప్టెన్ ఇవాన్ అందూర్ తమ ఎయిర్ లైన్స్ లో చాలా కాలంగా పని చేస్తున్నారని, ఆయనకు 25 ఏళ్ల అనుభవం ఉందని లాథమ్ ఎయిర్‌లైన్స్‌ పేర్కొంది. అలాంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరంగా ఉందని తెలిపింది. కెప్టెన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది. అప్పటి వరకు విధులు నిర్వర్తించిన కెప్టెన్.. ఉన్నట్టుండి ప్రాణాలు కోల్పోయి విగతజీవిగా మారడం పట్ల ఎయిర్ లైన్స్ సిబ్బంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లు కలిసి పని చేసిన వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరంగా ఉందన్నారు. ఈ ఘటన నేపథ్యంలోనే ఆ విమానంలోని ప్రయాణికులను మరుసటి రోజు చిలీకి చేర్చినట్లు ఎయిర్ లైన్స్ ఓ ప్రకటనలో పేర్కొంది.


Also Read: Delhi Teacher: హిందీ పుస్తకం తీసుకురాలేదని కొట్టిన టీచర్, విద్యార్థికి ఆస్పత్రిలో చికిత్స


రన్‌వేపై స్కిడ్ అయిన విమానం


బ్రెజిల్‌లో ఓ విమానం రన్‌వేపై స్కిడ్ అయ్యి ప్రయాణికులను తెగ టెన్షన్ పెట్టింది. ఈ ప్రమాదకర ఘటన బ్రెజిల్‌లో జరిగింది. LATAM  ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం...ఫ్లోరియానోపోలిస్ హెర్సీలియో లుజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన సమయంలో ఒక్కసారిగా స్కిడ్ అయింది. ఓ ప్యాసింజర్ ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. విమానం స్కిడ్ అయిన వెంటనే అందరూ గట్టిగా అరిచారు. ఆ సమయంలో అక్కడ భారీ వర్షం పడుతోంది. ఈ కారణంగానే ఫ్లైట్ స్కిడ్ అయిందని అధికారులు వెల్లడించారు.