అట్లాంటిక్ మహా సముద్రంలో మరో విషాదం చోటు చేసుకుంది. మహా సముద్రంలో గల్లైంతైన సబ్‌మెర్సిబుల్‌లో ఉన్న ఐదుగురు వ్యక్తులు మరణించారు. టైటానిక్ చూసేందుకు వెళ్లిన జలంతర్గామి మిస్ అవ్వడంతో మూడు రోజుల నుంచి అన్వేషణ సాగింది. ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు ఇలా విషాదంతో ఈ ఎపిసోడ్ ముగిసింది.
ఈ సబ్‌మెరైన్‌లో చనిపోయిన వారి సాహసం ఊరికే పోదని ఓషన్‌గేట్ ఎక్స్‌పెడిషన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. వీళ్లు నిజమైన అన్వేషకులని కొనియాడింది. ఇది మరెందరికో స్పూర్తి అని కితాబు ఇచ్చింది. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి కలగాలని వారి ఫ్యామిలీకి దేవుడు ధైర్యం ఇవ్వాలని ఆకాంక్షించింది. గల్లంతైన జలాంతర్గామి ఆపరేటింగ్ కంపెనీయే ఈ ఓషన్‌గేట్.
ఈ సబ్‌మెరైన్ కోసం మనవరహిత రోబోట్‌ను కెనడియన్ షిప్ నుంచి అట్లాంటికి మహాసముద్రంలోకి పంపించారు. ఈ రోబోట్ ద్వార పరిశీలిస్తే 1,600 అడుగులు లోతులో పురాతన శిథిలాలు గుర్తించినట్టు అమెరికా కోస్ట్ గార్డ్ రియర్ అడ్మిరల్ జాన్ మౌగర్ చెప్పారు.
గల్లంతైన జలాంతర్గామి ఆపరేటింగ్ కంపెనీ ఓషియన్గేట్ మాట్లాడుతూ జలాంతర్గామిలో ఉన్న ప్రయాణికులందరూ దుర్మరణం పాలయ్యారని భావిస్తున్నట్లు తెలిపింది. ఈ విషాద సమయంలో ఈ ఐదుగురు ప్రయాణీకుల కుటుంబాల్లోని ప్రతి సభ్యుడికి మా ఆలోచనలు ఉన్నాయి" అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దుర్ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నాం.
టైటానిక్ నౌక శిథిలాలను చూపించడానికి జలాంతర్గామి ఆదివారం ఉదయం అట్లాంటిక్ మహాసముద్రం నుంచి ప్రయాణం చేసింది. టైటానిక్ శిథిలాలు కేప్ కోడ్‌కు తూర్పున 18,1 కిలోమీటర్లు, న్యూఫౌండ్ లాండ్‌లోని సెయింట్ జాన్స్‌కు దక్షిణంగా 450 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
గల్లంతైన జలాంతర్గామిలో బ్రిటిష్-పాకిస్తాన్ బిలియనీర్ ప్రిన్స్ దావూద్ (ఎంగ్రో కార్ప్ వైస్ చైర్మన్), ఆయన కుమారుడు సులేమాన్, బ్రిటిష్ బిలియనీర్ హమిష్ హార్డింగ్, ఫ్రెంచ్ పర్యాటకుడు పాల్-హెన్రీ నార్గియోలెట్, ఓషన్గేట్ సీఈఓ స్టాక్టన్ రష్ ఉన్నారు.