Viral News: రహదారిపై కారు వెళుతోంది, రేడియోలో పాటలు వినిపిస్తున్నాయి, కూతురు వెనుక సీటులో ప్రశాంతంగా నిద్రపోతోంది . భర్త చాలా ఆనందంగా బండి నడుపుతున్నాడు. కానీ అకస్మాత్తుగా అతను వెనక్కి చూసి ఆశ్చర్యపోయాడు, ఎందుకంటే కారులో భార్య లేదని అప్పటి వరకు అతను గుర్తించలేదు. అవును, ఇది నిజమే. ఒక వ్యక్తి హాలిడే ట్రిప్‌నకు వెళుతున్నప్పుడు తన భార్యను పెట్రోల్ పంపు వద్ద వదిలి వెళ్ళాడు. అతను 300 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఈ విషయాన్ని గుర్తించాడు.
సెలవులకు వెళుతూ పెట్రోల్ పంపు వద్ద భార్యను మర్చిపోయిన వ్యక్తి
పారిస్ నుంచి ఒక వ్యక్తి తన భార్య, కుమార్తెతో కలిసి మొరాకోకు సెలవులకు వెళుతున్నాడు. అంతా బాగానే ఉంది, కానీ ప్రయాణంలో జరిగిన ఘటన ఆశ్చర్యపోయేలా చేసింది. జూలై 5 ఉదయం 4:30 గంటలకు, వారు దారిలో ఒక పెట్రోల్ పంపు వద్ద కారు ఆపారు. అక్కడ కొంతసేపు ఆగి బయలుదేరారు. కానీ అతను తన భార్యను అక్కడే వదిలి వెళ్ళారని ముందుగా గుర్తించలేదు. ఆ విషయమే మర్చిపోయి కారు నడుపుకొని ఒకటి రెండు కిలోమీటర్లు కాదు ఏకంగా దాదాపు 300 కిలోమీటర్లు వెళ్ళిపోయాడు. అప్పుడు కానీ తన భార్య కారులో లేదని గుర్తించలేకపోయాడు. భయపడి, అతను వెంటనే అత్యవసర నంబర్‌కు ఫోన్ చేశాడు.
పోలీసులకు ఫోన్ చేసిన తర్వాత వారు పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడి ఆగి పెట్రోల్ కొట్టించారని ప్రశ్నించారు. విషయం కూడా తనకు గుర్తు తేలనది సదరు వ్యక్తి చెప్పడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు.
300 కి.మీ దూరంలో భార్య దొరికింది
పెట్రోల్ ఎక్కడ కొట్టించాడో కూడా గుర్తు లేకపోవడంతో సమస్య మరింత జటిలమైంది. ఎందుకంటే కారులో ఉన్న అతని కుమార్తె నిద్రపోతోంది కాబట్టి ఆమెకి కూడా ఎక్కడ ఆగారో తెలియదు. పోలీసులు మొత్తం మార్గంలోని పెట్రోల్ పంపులను తనిఖీ చేశారు, కాని మహిళ గురించి ఎటువంటి సమాచారం లేదు.
మహిళ ఆచూకీ లభించకపోవడంతో ఆ వ్యక్తిపైనే అనుమానం వచ్చింది. కావాలనే భార్యను వదిలిపెట్టాడని కొందరు అనుమానించారు. కానీ చివరికి, మహిళ ఫోన్ మొబైల్ నెట్‌వర్క్ సహాయంతో ట్రాక్ చేశారు. ఆమె తన భర్త ఆమెను మర్చిపోయిన మోటార్‌వే సర్వీస్ స్టేషన్‌లో గుర్తించారు. ఉదయం 4:30 నుంచి, మహిళ తన భర్త, కుమార్తె కోసం అక్కడే కూర్చుని ఉన్నారు.
విచారణ తరువాత, ఇది పొరపాటున జరిగిందని కావాలనే ఆ వ్యక్తి భార్యను విడిచిపెట్టి వెళ్లలేదని పోలీసులు గుర్తించారు. ఆమె ఎక్కడుందో తెలియడంతో అక్కడకు వెళ్లిన భర్త ఆమెను పిక్ చేసుకొని వెళ్లిపోయారు. భర్త, భార్య , కుమార్తె మళ్ళీ విహార యాత్రకు బయల్దేరారు.
ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే, ఇది లక్షల మంది ఈ ఘటన చూశారు చదివారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా రాశాడు... సోదరుడికి ఏదో రూపంలో గుర్తుకు వచ్చింది, లేకపోతే భార్యను మర్చిపోయిన తర్వాత గుర్తుపెట్టుకోవడం కష్టమని సటైర్ వేశారు. మరొక వినియోగదారు ఇలా కామెంట్ చేశాడు... ఈ వ్యక్తి చాలా ప్రమాదకరమైన సాహసం చేశాడని అన్నారు. మరొక వినియోగదారు రాస్తూ... తనను కూడా తండ్రి మర్చిపోతారని చిన్నారి భయడే ఉంటుందని అన్నారు.