AI in Fertility Treatment : ఈ రోజుల్లో సంతాన సమస్యలు చాలామందిలో ఉంటున్నాయి. మగ, ఆడ తేడా లేకుండా చాలామంది దీనితో ఇబ్బందులు పడుతున్నారు. అలా ఓ జంట 18 ఏళ్లుగా తల్లిదండ్రులు అయ్యేందుకు ఎదురు చూశారు. తిరగని డాక్టర్లు లేరు. చివరికి IVF కూడా వారికి హ్యాండ్ ఇచ్చింది. కానీ AI మాత్రం వారి ఆశలను నిజం చేస్తూ.. ఇప్పుడు ఆ జంట ప్రెగ్నెంట్ అయ్యేందుకు కారణం అయింది.
రానున్న రోజుల్లో అన్ని రంగాల్లో తనదైన శైలిలో ముందుకు వెళ్తుందనే నిపుణుల మాటలను నిజం చేస్తుంది AI. వైద్యరంగంలో కూడా దీని వినియోగం మొదలైపోయింది. AI సహాయంతో ఎన్నో వండర్స్ చేస్తున్నారు. కొలంబియా యూనివర్సిటీలో జరిగిన ఈ AI ప్రయత్నం వంధ్యత్వంతో ఇబ్బంది పడే ఎందరికో ఆశలు కల్పిస్తుంది.
విఫలమైన IVF
అజోస్పెర్మియా వంధ్యత్వంతో ఇబ్బంది పడుతున్న ఓ జంట అనేకసార్లు ప్రెగ్నెన్సీకి ట్రై చేసింది. IVF కూడా చివరికి విఫలమైంది. దీంతో వారు పిల్లలపై ఆశలు వదిలేసుకున్నారు. కానీ కొలంబియాలోని యూనివర్సిటీ ఫెర్టిలిటీ సెంటర్లో స్టార్ (STAR) అనే పద్ధతిలో వారి సమస్యను దూరం చేసింది AI. గతంలో IVF కోసం చేసిన స్పెర్మ్ ఎనలైజర్లో క్వాలిటీ స్పెర్మ్ గుర్తించలేకపోయారు. కానీ ఏఐ మాత్రం వాటిని గుర్తించి.. తక్కువ స్పెర్మ్‌తో వారు ప్రెగ్నెంట్ అయ్యేలా చేసింది.
వంధ్యత్వంతో ఇబ్బంది పడుతున్న పురుషుడి స్పెర్మ్‌లో కొద్దిపాటి స్పెర్మ్‌ను (కేవలం మూడు వీర్యకణాలను) స్టార్ పద్ధతిలో గుడ్లతో కలిపి ఫలదీకరణం చేశారు. ఇది వారికి మంచి రిజల్ట్స్ ఇవ్వడంతో ఆ జంట ప్రెగ్నెంట్ అయ్యారు. డిసెంబర్లో వారికి డెలివరీ డేట్ ఇచ్చారు. ఇది పురుషుల్లోని వంధ్యత్వ చికిత్సలో కీలకపాత్ర పోషించనుందని తెలిపారు.
STAR పద్ధతి..
Sperm Tracking and Recovery. ఈ స్టార్ పద్ధతి ద్వారా AI వీర్య నమూనాను పూర్తిస్థాయిలో స్కాన్ చేసింది. దానిలోని మూడు బెటర్ స్పెర్మ్ కణాలు వెలికితీసి.. వాటిని IVFలో ఉపయోగించారు. దానిని అండంలోకి ప్రవేశపెట్టడంతో ఆ జంట ప్రెగ్నెన్సీ అవకాశాన్ని పొందారు.
ఈ పద్ధతి వంధ్యత్వంతో ఇబ్బంది పడుతున్న జంటల్లో ఎన్నో వండర్స్ చేయనుంది. ఎందుకుంటే ప్రస్తుతకాలంలో చాలామంది పురుషులు వంధ్యత్వంతో బాధపడుతున్నారు. వారి లైఫ్ స్టైల్, స్ట్రెస్, జాబ్స్, తిండి వంటి అలవాట్లు ఈ సమస్యకు కారణమవుతున్నాయి. అయితే ఈ స్టార్ పద్ధతి వంధ్యత్వంతో సమస్యతో పిల్లలకోసం ఎదురుచూస్తోన్న వారికి మంచి వరం కానుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.