Meghasandesam Serial Today Episode: నక్షత్ర చేసిన అవమానం తట్టుకోలేక చెర్రి ఒంటరిగా కూర్చుని బాధపడుతుంటాడు. శరత్‌ చంద్ర అన్న మాటలు గుర్తు చేసుకుంటాడు. ఇంతలో అక్కడకు భూమి వస్తుంది. అసలు రాత్రి ఏం జరిగింది చెర్రి అంటూ అడుగుతుంది.

చెర్రి: చూశావు కదా భూమి పాల గ్లాస్‌ విసిరి కొట్టాను. నేనంటే ఇష్టం లేదని నక్షత్ర ఒప్పుకునేంత వరకు కొట్టాలనుకున్నాను. కానీ నా బ్యాడ్‌ లక్‌ దొరికిపోయాను.

భూమి: రాముడి లాంటి వాడు సడెన్‌గా రాక్షసుడు అయిపోయాడంటే నమ్మేంత పిచ్చి దాన్ని కాదు చెర్రి నేను. రాత్రి ఏదో జరిగిందని అర్థం అయింది. నక్షత్ర మాటల నమ్మి నాన్న అప్పటికే కోపంతో ఊగిపోతున్నారు. అందుకే నేను ఏమీ కలగజేసుకోలేదు. అసలు ఏం జరిగిందో చెప్పు చెర్రి.

అని అడగ్గానే నక్షత్ర చేసింది మొత్తం చెప్పేస్తాడు చెర్రి

భూమి: మై గాడ్‌ నక్షత్ర ఆల్మోస్ట్‌ సైకోలా బిహేవ్‌ చేసింది అన్నమాట.

చెర్రి: సైకోలో బిహేవ్‌ చేయడం కాదు భూమి తను నిజంగానే సైకో..

భూమి: లేదు చెర్రి సైకోలా యాక్ట్ చేస్తుంది. తన గోల్ ఒక్కటే. బయటకు తను మంచిగా నటించి నిన్ను చెడ్డవాడిగా ఫ్రూవ్‌ చేయాలనుకుంటుంది. మా నాన్న మీ పెళ్లిని యాక్సెప్ట్‌ చేశారు. కదా మా నాన్న చేతే ఈ పెళ్లి పెళ్లే కాదని చెప్పించాలనుకుంటుంది. మీ ఇద్దరికీ డివోర్స్‌ నాన్నే ఇప్పించాలనేది తన ప్లాన్‌. పోనీలే చెర్రి నక్షత్ర అంటే నీకు ఎలాగో ఇష్టం లేదు కదా ఇది కూడా ఒక్కందుకు మంచిదేలే.. తను నిన్ను చెడ్డవాడిగా ఫ్రూవ్‌ చేయాలనుకుంటుంది. నువ్వు కూడా అలాగే కనిపించు. మీ ఇద్దరికి త్వరగా డివోర్స్‌ వచ్చేస్తాయి.

చెర్రి: నో భూమి నాకు మనఃశాంతి లేకపోయినా పర్వాలేదు. నన్ను నిప్పుల్లో వేసి కాల్చినా పర్వాలేదు. కానీ భార్యాభర్తలుగా మా బంధాన్ని త్వరగా చెరగనివ్వను.

భూమి: అదేంటి చెర్రి అలా మాట్లాడుతున్నావు. నీకు తనంటే ఇష్టం లేదు కదా..?

చెర్రి: అవును తనంటే ఇష్టం లేదు భూమి కానీ నాకు మా అన్నయ్య అంటే ప్రాణం. తన కోసం నేను చావడానికైనా సిద్దమే.

భూమి: నువ్వు చెప్తుంది నాకు అసలు అర్థం కావడం లేదు.

చెర్రి: నక్షత్ర డివోర్స్‌ తీసుకుని మా బంధం నుంచి బయటపడితే తను మళ్లీ గగన్‌ అన్నయ్య చుట్టు తిరగడం మొదలుపెడుతుంది. నన్ను చంపేయడానికి కూడా సిద్దంగా ఉన్న సైకోయిజాన్ని రాత్రి నేను తనలో చూశాను. మీరిద్దరికి పెళ్లి అయ్యే వరకు నేను నక్షత్రను వదిలిపెట్టను.

అని చెప్పి చెర్రి వెళ్లిపోతాడు. మరోవైపు కేపీ, శారదకు ఫోన్‌ చేసి శరత్‌చంద్ర గారు  భూమికి పెళ్లి ఫిక్స్‌ చేశారని చెప్తాడు. ఈ పెళ్లికి భూమి ఒప్పుకుందా అని శారద అడిగితే శరత్‌చంద్రకు భూమి ఇష్టాలతో పనేముందని చెప్తాడు. శారద ఏడుస్తుంది. ఇంతలో స్వీట్లు తీసుకుని గగన్‌ వస్తాడు. అందరికీ స్వీట్లు పంచుతాడు.

గగన్‌: అమ్మా మీకో గుడ్‌ న్యూస్‌..

శారద: ఇప్పుడు నోరు తీపి అయిపోయింది కదా..? ఇప్పుడు చెప్పు ఏంటా గుడ్‌ న్యూస్‌..

గగన్‌: అమ్మా భూమికి పెళ్లి ఫిక్స్‌ అయిపోయిందమ్మా.. నేను ఈరోజు చాలా హ్యాపీగ ఉన్నాను. పట్టిన గ్రహణం వదిలి మన ఇంటికి వెలుగు వస్తుందమ్మా.. నీకు ఆనందంగా లేదా..?

అంటూ చెప్పి పైకి రూంలోకి వెల్లిపోతాడు గగన్‌. రూమ్‌ క్లోజ్‌ చేసుకుని ఒక్కడే ఏడుస్తుంటాడు. మరోవైపు భూమి కూడా గగన్‌ను గుర్తు చేసుకుని ఏడుస్తుంది. దీంతో భూమి షాక్‌ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!