Nindu Noorella Saavasam Serial Today Episode: బెస్ట్ కపుల్ కాంపిటీషన్ అవార్డుకు అమర్, భాగీని ఎంపిక చేస్తారు. దీంతో అందరూ చప్పట్లు కొడుతూ వాళ్లను అభినందిస్తారు. స్టేజీ మీదకు పిలిచి శాలువాతో సత్కరించి చెక్కు, అవార్డు ఇస్తారు అదంతా చూస్తున్న చిత్ర కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. వెనకే వినోద్ వెళ్లిపోతాడు. ఇద్దరూ ఒక చోట నిలబడి ఉంటారు.
వినోద్: ఇంకా ఎంతసేపు ఇక్కడ ఉంటాము చిత్ర ఇంటికి వెళ్దాం పదా
చిత్ర: వెళ్లి భాగీ, బావగారు గెలిచారని అందరూ చిందులు వేస్తూ విందులు చేసుకుంటుంటే.. మనం చూస్తూ ఉండాలా.? అరే ఏంటండి బావగారికి మీరంటే కొంచెం కూడా ప్రేమ లేదా..? మీ కోసం మిమ్మల్ని గెలిపించడం కోసమైనా ఆయన ఓడిపోవచ్చు కదా…?
వినోద్: అదేంటి చిత్ర అలా మాట్లాడుతున్నావు అన్నయ్య గెలిచినా.. మనం గెలిచినా.. ఒక్కటే కదా
చిత్ర: అవునా అయితే వెళ్లి మీ అన్నయ్య గెలిచిన చెక్ తీసుకురండి. తీసుకురాలేరు కదా..? మరి ఇలాంటి మాటలు మాట్లాడకండి.. నేనసలే ఒళ్లు మండిపోయి ఉన్నాను. బిజినెస్ చేస్తాం డబ్బులు ఇవ్వమంటే ఇవ్వరు.. కాంపిటీషన్‌లో అయినా గెలుద్దం అంటే అక్కడ కూడా ఓడిస్తారు. అసలు మనం ఎలా బతకాలి. వినోద్ మనం ఇంటికి వెళ్లి వేరు కాపురం పెడదాం అని చెబుదాం. ఆస్థి బాగాలు పెట్టమని అడుగుదాం. మనం ఇప్పుడు నేరుగా వెళ్లి
వినోద్: చిత్ర వేరు కాపురం అన్న ఆలోచన కూడా రానివ్వకు. ఎందుకంటే నేను అన్నయ్యను పిల్లలను వదిలి ఎక్కడిక రాను. అందరితో కలిసి ఉండటం.. అడ్జస్ట్ అవ్వడం నీకు అలవాటు ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు చేసుకో ఎందుకంటే నేను నా ఫ్యామిలీ వదిలి ఎక్కడికి రాను..
అని కరాకండిగా చెప్పి వెల్లి కారులో కూర్చుంటాడు.
చిత్ర: నాకంటే నీకు నీ వాళ్లే ఎక్కువా వినోద్ అయితే చూస్తాను. వాళ్లంతట వాళ్లే ఆస్థి బాగాలు పంచి మనల్ని వేరు కాపురం పెట్టేలా చేస్తాను
అని మనసులో అనుకుంటూ వెళ్లి కారులో కూర్చుంటుంది చిత్ర. మరోవైపు ఇంటికి వెళ్లిన అమర్, భాగీ డోర్ బెల్ కొట్టగానే.. కంగారుగా వచ్చి మనోహరి డోర్ తీస్తుంది.
మను: హమ్మయ్య అమర్ వచ్చేశారా..?
అమర్: ఏమైంది మనోహరి ఎందుకు అంత కంగారు పడుతున్నావు
మను: కంగారేం లేదు అమర్
భాగీ: ఏమీ లేకపోతే మీరు అంత కంగారు పడరు కదా మనోహరి గారు
మను: అంటే అది పిల్లలను ఒక్కదాన్ని ఎప్పుడూ చూసుకోలేదు కదా..? అందుకే.. పైగా మీరు సడెన్‌గా కాలింగ్ బెల్ కొట్టారు భయపడ్డాను అంతే తప్పా ఏం లేదు. అమర్ రేపు మధ్యాహ్నం వరకు మీరు రారేమో అని కంగారు పడ్డాను
అమర్: కాంపిటీషన్‌లో చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయింది .అందుకే కాంపిటీషన్‌ను త్వరగా ఫినిష్ చేశారు
మను: సరే అమర్ నువ్వు వెళ్లి ఫ్రెష్ అవ్వు
అని మను చెప్పగానే అమర్ పైకి వెళ్లిపోతాడు. తర్వాత రణవీర్ ఇంట్లో కూర్చుని కోపంగా చూస్తుంటే మనోహరి వెళ్తుంది.
మను: నువ్వు వేస్ట్ రణవీర్ నువ్వు ఎంత ట్రై చేసినా ఫెయిల్ అవుతూ ఉంటావు తప్పితే సక్సెస్ అవ్వలేవు ఎందుకంటే ఆరు ఆత్మకు అన్ని శక్తులు ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఇంట్లో నుంచి పోవడం లేదు. అసలు ఏం చేస్తే దాని పీడ వదిలిపోతుందో అసలు అర్తం కావడం లేదు
రణవీర్: ఈ సారి ఘోరాలు, అఘోరాలు కాదు. వాళ్లను మించిన శక్తిని పిలిపిస్తాను.
మను: ఎవరు వాళ్లు రణవీర్
రణవీర్: శంభా..
అంటూ రణవీర్ చెప్పగానే మనోహరి సరే ఎవరినైనా పిలిపించు కానీ ఆరు ఆత్మను మాత్రం ఇంట్లోంచి వెళ్లగొట్టేలా చూడు అని చెప్పి వెళ్లిపోతుంది. తర్వాత రణవీర్ కొల్‌కతా నుంచి శంభాను తీసుకొచ్చి అమర్ ఇంటి దగ్గర వదిలేస్తాడు. శంభా రావడం తెలుసుకున్న గుప్త, ఆరు షాక్ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!