Pahalgam Terror Attack: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తరువా భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత మరింత పెరుగుతోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ సైన్యాన్ని అలర్ట్ చేస్తోంది. తన మిత్ర దేశాలను సైతం యుద్ధ విమానాలు, ఆయుధాలు ఇచ్చి సహకరించాలని టర్కీ లాంటి దేశాలను కోరుతోంది. ఈ క్రమంలో భారత్ తమ దేశం మీద ఎప్పుడైన దాడి చేసే అవకాశం ఉందని పాక్ లో ఆందోళన రోజురోజుకూ మరింతగా పెరిగిపోతోంది. భారతదేశం ఎప్పుడైనా దాడి చేయవచ్చునని, అప్రమత్తంగా ఉండాలని పాకిస్తాన్ మంత్రులు ప్రతిరోజు ప్రకటనలు చేస్తున్నారు.
ఈ క్రమంలో ఎల్వోసీ నుంచి (నియంత్రణ రేఖ నుంచి) వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖైబర్ కనుమ (KPK) ప్రాంతం సహా 29 జిల్లాల్లో పాకిస్తాన్ సైరన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇందులో పెషావర్, అబ్బోటాబాద్ ప్రాంతాలు సైతం ఉన్నాయి. ప్రభుత్వం ఆదేశాలతో ఆ జిల్లాల అధికారులు సైరన్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఎప్పటికప్పుడూ సూచనలు చేసే ఏర్పాట్లు చేస్తున్నారు.
స్థానిక ఖైబర్ ప్రభుత్వ పౌర రక్షణ విభాగం అన్ని డిప్యూటీ కమిషనర్లు, పౌర రక్షణ అధికారులకు తక్షణమే ఈ సైరన్లను ఏర్పాటు చేసి నివేదికను పంపాలని సైతం ఆదేశించింది. పెషావర్, అబ్బోటాబాద్, స్వాత్, డెరా ఇస్మాయిల్ ఖాన్, మర్దాన్, కోహాట్, బన్నూ వంటి పెద్ద నగరాల్లో 4 నాలుగు సైరన్లు ఏర్పాటు చేయనున్నారు. మిగిలిన 22 జిల్లాల్లో ఒక్కొక్క సైరన్ ఏర్పాటు చేయనున్నారు. వాటిలో లోయర్ డీర్, చిత్రాల్, బజౌర్, హంగు, వజీరిస్తాన్, కుర్రం, నౌషేరా, హరిపూర్, ఓర్కజై వంటి ప్రాంతాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
ఎల్వోసీ నుండి దూరంలో ఉన్న ప్రాంతాలువాస్తవానికి సైరన్లు ఏర్పాటు చేస్తున్న ఈ జిల్లాలు ఎల్వోసీ నుంచి చాలా దూరంలో ఉన్నాయి. కొన్ని జిల్లాలు 300 నుండి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నా పాక్ ప్రభుత్వం మాత్రం ఆందోళనతో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోంది. అయినప్పటికీ, అక్కడ సైరన్లను ఏర్పాటు చేయడం, భారతదేశం తమపై దాడి చేస్తుందని, పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా సైనిక చర్య చేపడుతుందని పాక్ ప్రభుత్వం భావిస్తోంది.
ఎయిర్ సైరన్లను ఏర్పాటు చేస్తున్న ఫొటోలు లీక్పాకిస్తాన్‌లోని బజౌర్ ప్రాంతంలో ఎయిర్ సైరన్లను ఏర్పాటు చేస్తున్న ఫొటోలు బయటకు వచ్చాయి. నియంత్రణ రేఖ వద్ద నుంచి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాల నుండి అఫ్ఘానిస్తాన్ సరిహద్దులో ఉన్న ప్రాంతాల వరకు సైతం పాక్ అధికారులు ఎయిర్ సైరన్లను ఏర్పాటు చేస్తున్నారు. భారత్.. అఫ్ఘానిస్తాన్ భూభాగం ద్వారా సైతం పాకిస్తాన్‌పై దాడి చేయవచ్చనే భయం పాకిస్తాన్ లో నెలకొంది. పహల్గాం ఉగ్రదాడి తరువాత పాకిస్తాన్‌పై భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. వీసాలు రద్దు, అట్టారీ వాఘా సరిహద్దు మూసివేత, హైకమిషన్లలో అధికారులను తగ్గించడం, సింధు జలాల ఒప్పందంపై నిషేధం లాంటి కఠిన చర్యలు పాక్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. పాక్ సైన్యం అప్రమత్తం కావడంతో పాటు యువతకు సైతం శిక్షణ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. భార ప్రభుత్వం యుద్ధం లాంటి ఎలాంటి ప్రకటన చేయకున్నా దాయాది దేశం వణికిపోతోంది.