India ready to create artificial Sun:  భారతదేశంతో సహా 30 దేశాల శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన  కృత్రిమ సూర్యుడ్ని తయారు చేస్తున్నారు.    కృత్రిమ సూర్యుడు (Artificial Sun) అని పిలిచే న్యూక్లియర్ ఫ్యూజన్ రిసెర్చ్‌లో గణనీయమైన పురోగతిని భారత్ సాధిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లు న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా స్వచ్ఛమైన, అపరిమిత శక్తిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడతాయి. ఇది సూర్యుడిలో జరిగే ప్రక్రియను పోలి ఉంటుంది.                               గుజరాత్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రిసెర్చ్ (IPR)లో 2013 నుండి   SST-1 ప్రాజెక్టుపై పని చేస్తోంది.   భారతదేశం   అత్యంత ముఖ్యమైన ఫ్యూజన్ రియాక్టర్ ప్రాజెక్ట్ ఇది.  ఇది సూర్యుడి కోర్ కంటే 20 రెట్లు వేడిగా ఉండే అంటే  సుమారు 200 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ప్లాస్మాను ఉత్పత్తి చేసింది, ఇది భారతదేశాన్ని సూపర్‌కండక్టింగ్ టోకమాక్‌లను నిర్వహించే ఆరు దేశాల్లో  ఒకటిగా నిలిపింది  తదుపరి తరం ఫ్యూజన్ రియాక్టర్ SST-2ని అభివృద్ధి చేయడానికి ఇండియా సన్నాహాలు చేస్తోంది, దీని నిర్మాణం 2027లో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.

SST-2లో బయోలాజికల్ షీల్డింగ్ , అధునాతన ప్లాస్మా కంట్రోల్ సిస్టమ్స్ వంటి అధునాతన ఫీచర్‌లు ఉంటాయి భారతదేశం  మొట్టమొదటి స్వదేశీ టోకమాక్, ఆదిత్య, 1989లోలో సిద్ధమయింది. ఇటీవల దీన్ని అప్ గ్రేడ్ చేశారు.  ఆదిత్య-యూ ప్లాస్మా హీటింగ్ ,నిర్వహణలో సాంప్రదాయ టోకమాక్‌ల పరిమితులను అధిగమించానికి ఉపయోగపడుతుంది.   2005లో ఫ్రాన్స్‌లోని సెయింట్-పాల్-లెజ్-డురాన్స్‌లో నిర్మితమవుతున్న ITER ప్రాజెక్ట్‌లో పూర్తి భాగస్వామిగా భారత్  చేరింది. ITER అనేది 35 దేశాల సహకారం, ఇది న్యూక్లియర్ ఫ్యూజన్‌ను వాణిజ్యపరంగా ఆచరణీయమైన శక్తి వనరుగా మార్చుకునే లక్ష్యంగా పెట్టుకుంది.                    

ITER రియాక్టర్ సూర్యుడి కోర్ కంటే 10 రెట్లు వేడిగా ఉండే  ప్లాస్మాను ఉత్పత్తి చేయడానికి సిద్ధం చేస్తున్నారు.  ఇది భూమిపై ఒక "మినీ సూర్యుడ్ని "  సృష్టిస్తుంది.   భారతదేశం ప్రాజెక్ట్ ఖర్చులో 10 శాతం భరిస్తోంది.  2.2 బిలియన్ ఖర్చుతో ఈ పరిశోధనలు  జరుగుతున్నాయి.  చైనా  ఎక్స్‌పెరిమెంటల్ అడ్వాన్స్‌డ్ సూపర్‌కండక్టింగ్ టోకమాక్ ని  కూడా "కృత్రిమ సూర్యుడు" అని పిలుస్తారు. 2025 జనవరిలో 1,066 సెకండ్ల పాటు 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ వద్ద ప్లాస్మాను నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించింది.

చైనాకు ప ోటీగా భారత్ కూడా రెడీ ్వుతోంది.  SST-1 ద్వారా ఇప్పటికే కృత్రిమ సూర్యుడు రంగంలో గణనీయమైన మైలురాయిని సాధించింది . SST-2తో దాని సామర్థ్యాలను మరింత విస్తరించడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఫ్రాన్స్ లో ఈ పరిశోధనలు జరుగుతున్నాయి. న్యూక్లియర్ ఫ్యూజన్ స్వచ్ఛమైన, అపరిమిత శక్తిని అందిస్తుంది, ఇది గ్రీన్‌హౌస్ వాయువులను విడుదల చేయదు . న్యూక్లియర్ ఫిషన్‌తో పోలిస్తే రేడియోఆక్టివ్ వ్యర్థాలను ఉత్పత్తి చేయదు. ఫ్యూజన్ రియాక్టర్‌లు డ్యూటీరియం, ట్రిటియం వంటి సముద్ర జలంలో సులభంగా లభ్యమయ్యే ఇంధనాలను ఉపయోగిస్తాయి .