Satya Nadella on Sam Altman: 



మైక్రోసాఫ్ట్‌లోకి ఆల్ట్‌మన్ 


సామ్ ఆల్ట్‌మన్‌ని OpenAI కంపెనీ CEO బాధ్యతల (Sam Altman) నుంచి తప్పించిన నేపథ్యంలో కీలక ప్రకటన చేశారు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల. ఆల్ట్‌మన్‌తో పాటు గ్రెగ్ బ్రాక్‌మన్‌ (Greg Brockman) కూడా మైక్రోసాఫ్ట్‌లో (Microsoft) చేరుతున్నట్టు ట్వీట్ చేశారు. ఇద్దరు OpenAI మాజీ ఉద్యోగులూ మైక్రోసాఫ్ట్‌ కంపెనీలో చేరనున్నట్టు ప్రకటించారు. AI రీసెర్చ్ టీమ్‌ని వీళ్లిద్దరూ కలిసి లీడ్ చేస్తారని, వాళ్లకు కావాల్సిన వనరులను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 






"OpenAIతో కలిసి పని చేసేందుకు మేం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం. మైక్రోసాఫ్ట్ ఇగ్నైట్‌లో మేం ప్రకటించిన ప్రతి అంశాన్నీ కట్టుబడి ఉన్నాం. సామ్ ఆల్ట్‌మన్, గ్రెగ్‌ బ్రాక్‌మన్‌ ఇద్దరూ మా కంపెనీలో చేరుతున్నారు. AI రీసెర్చ్ టీమ్‌ని ఈ ఇద్దరే లీడ్ చేస్తారు. వాళ్లకు అవసరమైన రీసోర్సెస్ అందించేందుకు సిద్ధంగానే ఉన్నాం"


- సత్య నాదెళ్ల, మైక్రోసాఫ్ట్ సీఈవో


సత్య నాదెళ్ల ట్వీట్‌కి సామ్ ఆల్ట్‌మన్‌ రిప్లై ఇచ్చాడు. "Mission Continues" అని ట్వీట్ చేశాడు. దానికి మళ్లీ సత్యనాదెళ్ల స్పెషల్ ట్వీట్‌ చేశాడు. సామ్‌ ఆల్ట్‌మన్ మైక్రోసాఫ్ట్‌లోకి రావడంపై చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నానని వెల్లడించాడు.






"సామ్‌ ఆల్ట్‌మన్ మైక్రోసాప్ట్‌లోకి అడుగు పెడుగుతుండటం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. ఈ పరిణామంతో ఆవిష్కరణలు మరింత జోరందుకుంటాయని ఆశిస్తున్నాను. మైక్రోసాఫ్ట్‌ కంపెనీలో ఇన్నోవేటర్స్‌కి తగిన ప్రాధాన్యత ఉంటుంది. ఆ ప్రియారిటీ మీకు కూడా దక్కుతుంది"


- సత్యనాదెళ్ల, మైక్రోసాఫ్ట్ సీఈవో